లిపి ఎపిక్స్ ఆప్ లో రామాయణం ఈరోజు ప్రముఖుల సమక్షంలో దస్పల్లా హోటల్లో జరిగింది
ఈ సభకు శ్రీ మా శర్మ గారు అధ్యక్షత వహించారు. లిపి ఎపిక్స్ ఆప్ లో మహాభారత, రామాయణాలు కథలు, వీడియోలు, ఆడియోల రూపంలో యువతకు తెలియజేసే ఆలోచనతో సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వాడి తయారు చేశాము అని కంపెనీ సీఈవో శ్రీ విద్యాసాగర్ అనిసింగరాజుగారు తెలియజేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారు మాట్లాడుతూ మహాభారత రామాయణాలు మంచి నడవడిక, వ్యక్తిత్వ వికాసం కోసం అందరూ కచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పారు. ఎల్ వి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ పిల్లల మేధాశక్తి మీద భాష ఎలా ప్రభావితం చేస్తుందో తెలియచేసి లిపి ఎపిక్స్ ఆప్ ఆటల ద్వారా పిల్లలకు భాష మీద, మన సంస్కృతి మీద…
