Skip to content

‘మన శంకరవర ప్రసాద్ గారు’ మీసాల పిల్ల సాంగ్ కి 50 మిలియన్ల వ్యూస్

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు' ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల' 50 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా మ్యూజిక్ కి కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. హిట్‌మెషిన్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పండగ వాతావరణంలో, కుటుంబమంతా కలిసి చూసేలా ఉండే ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఆ వైబ్‌ను అద్భుతంగా అందించిన సాంగ్‌ “మీసాల పిల్ల”. భీమ్స్‌ సెసిరోలియో అందించిన ఎనర్జిటిక్‌ ట్యూన్‌, బీట్‌లతో ఈ పాట దేశవ్యాప్తంగా చార్ట్‌బస్టర్‌గా మారింది. తెలుగు పాటగా ఇంత పెద్ద స్థాయిలో పాన్‌-ఇండియా రీచ్‌ సాధించడం అరుదైన ఘనత. మెగాస్టార్‌ చిరంజీవి తన సిగ్నేచర్‌ చార్మ్‌, ఎక్స్ప్రెషన్స్‌, ఎనర్జిటిక్‌ డ్యాన్స్‌ మూవ్స్‌తో…

Read more

‘మదరాసి’ ని ఎంజాయ్ చేస్తారు: శివకార్తికేయన్

శివకార్తికేయన్ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మదరాసి', ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక వెంచర్ ఇప్పటికే టీజర్, ట్రైలర్, రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఎ.ఆర్. మురుగదాస్ గారి సినిమా. మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు లాంటి పెద్ద స్టార్స్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారు మురుగదాస్. ఆయనతో కలిసి వర్క్ చేసినందుకు…

Read more

ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ నాయకులు కనిపించడం లేదు: నిర్మాత నట్టి కుమార్ ఫైర్

తెలుగు సినీ పరిశ్రమలో పద్దెనిమిది రోజుల సమ్మెకు ముగింపు పలకడం సంతోషకరం, ఇందుకు చొరవ తీసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, మెగాస్టార్ చిరంజీవి గార్కి, అలాగే లేబర్ కమీషనర్ గార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని సీనియర్ నిర్మాత నట్టి కుమార్ అన్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాదారు. సినీ కార్మికుల సమ్మె ముగియడం సంతోషకరమే అయినప్పటికీ, మా చిన్న నిర్మాతలకు, అలాగే వివిధ సంఘాలకు చెందిన కార్మికులకు అనేక సందేహాలు ఉన్నాయని, వాటిని తీర్చేందుకు చర్చలలో పాల్గొన్న ఫిలిం ఛాంబర్ పెద్దలు కానీ, అటు ఫెడరేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు కానీ ఎవరూ కనిపించడం లేదని నట్టి కుమార్ అన్నారు.

Read more