‘డాన్ బాస్కో’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను – డైరెక్టర్ వెంకీ అట్లూరి
రుష్య దత్తా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘డాన్ బాస్కో’. రాధా కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై వెంకట్ ఉప్పుటూరి నిర్మాణంలో గౌరీ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రాజ్‌కుమార్ కసిరెడ్డి, మిర్నా మీనన్, మౌనిక, మురళీ శర్మ, ప్రిన్సిపాల్ విశ్వనాథ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, విష్ణు ఓఐ, ఉత్తేజ్, వినయ్ నల్లకడి, మోహన శ్రీ సురాగా తదితరులు కీలక పాత్రలు పోషించారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. వెంకీ అట్లూరి మాట్లాడుతూ .. ‘‘డాన్ బాస్కో’ టీజర్ బాగుంది. ఎంతో వినోదాత్మకంగా సాగింది…
