‘కాస్ట్’ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
వరుణ్ సందేశ్, గగన్ బాబు, సత్యం రాజేష్, రవి సోషల్ డ్రామా ‘కాస్ట్’(Caste) ఇంటెన్స్ అండ్ గ్రిప్పింగ్ టీజర్ లాంచ్ వరుణ్ సందేశ్, గగన్ బాబు , సత్యం రాజేశ్, రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సోషల్ డ్రామా ‘కాస్ట్’. ఏకే జంపన్న రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. కశిక కపూర్, దివి వద్యా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తిని పెంచిన చిత్ర బృందం తాజాగా ఇంటెన్స్ అండ్ గ్రిప్పింగ్ టీజర్‌ను లాంచ్ చేసింది. కుల వివక్ష అనే ప్రధాన ఇతివృత్తాన్ని పరిచయం చేస్తూ టీజర్ ప్రారంభమవుతుంది. అగ్రకులానికి చెందిన వారి ఇంట్లోకి తమకు ప్రవేశం లేదని…
