“మటన్” మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
”పుష్ప” ఫేమ్ జగదీష్ ప్రతాప్ బండారి లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ "మటన్". ఈ చిత్రాన్ని డైస్ ఆర్ట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై యువ దర్శకుడు హర్షా డైస్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న "మటన్" మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి పెట్టిన 'రక్తం.. రణం.. ప్రతీకారం..' అనే ట్యాగ్‌లైన్ ఆసక్తిని పెంచుతోంది. ఈ రోజు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. జగదీష్ ప్రతాప్ బండారి రా అండ్ రస్టిక్ లుక్ తో "మటన్" మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఆయన లుక్ ఇంటెన్స్ గా కనిపిస్తోంది. మోషన్ పోస్టర్ లో…
