‘నాగబంధం’ ఫస్ట్ సింగిల్ “నమో రే” మార్చి 15న రిలీజ్
మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియన్ మూవీ నాగబంధం అద్భుతమైన కంటెంట్ తో సంచలనం సృష్టిస్తోంది. అభిషేక్ నామా దర్శకత్వంలో NIK స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో విరాట్ కర్ణ హీరోగా నటించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో భారతీయ సినిమాలో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయబోతోంది. మార్చి 15న ఉదయం 11:11 గంటలకు నాగబంధం ఫస్ట్ సింగిల్ "నమో రే" రిలీజ్ కానుంది. ఈ పాట నారాయణుడికి నివాళిగా ఆధ్యాత్మికత ప్రజెంట్ చేయబోతోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న నాగబంధంలో “నమో రే” సాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఈ పాటలో ఏకంగా 1,000 మంది డ్యాన్సర్లు పాల్గొంటూ, భారతీయ నృత్య కళల వైవిధ్యం, ఐక్యతను ప్రతిబింబించే అద్భుతమైన…
