‘VISA – వింటారా సరదాగా’ ఫస్ట్ లుక్ జూలై 12న టైటిల్ టీజర్ విడుదల
ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. సితార సంస్థ నుంచి వస్తున్న మరో విభిన్న చిత్రం 'VISA - వింటారా సరదాగా'. 'VISA - వింటారా సరదాగా' ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. వినోదం, ప్రేమ, భావోద్వేగాలతో నిండిన ఓ సరికొత్త యూత్‌ఫుల్ రైడ్‌ను వాగ్దానం చేస్తున్నట్టుగా ఈ ఫస్ట్ లుక్ ఉంది. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రం.. విదేశాలలో చదువుతున్న భారతీయ విద్యార్థుల జీవితాలను, వారి కలలను, సందిగ్ధతలను, స్నేహాలను మరియు మధుర క్షణాలను ప్రేక్షకుల మనసుకి తాకేలా చూపించనుంది. యువత మెచ్చేలా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు…
