Skip to content

‘రాకాస’ తెలుగు హక్కులు శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్‌ సొంతం

ఏప్రిల్ 3న రిలీజ్ కానున్న ఫ్యాన్సీ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రాకాస‌’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రారంభం నుంచి వైవిధ్యమైన కంటెంట్, ప్రమోషనల్ ప్లానింగ్‌తో ఈ సినిమా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు ముందే జ‌రిగిన థియేట్రిక‌ల్ బిజినెస్ డీల్ ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణల్లో ఈ సినిమా థియేట్రిల్ రైట్స్‌ను శ్రీ ల‌క్ష్మి న‌ర‌సింహ మూవీ మేక‌ర్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు. దీంతో సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏంటో తెలుస్తుంది. సినిమాకు థియేట‌ర్స్‌లో మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంద‌ని ట్రేడ్ స‌ర్కిల్స్ భావిస్తున్నాయి. రాకాస సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న‌ సమయంలో ఈ లేటెస్ట్ డీల్‌తో ‘రాకాసా’ చిత్రానికి డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ మరింత బలపడింది. తెలుగు రాష్ట్రాల్లో…

Read more

‘రాకాస’ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది – నిహారిక కొణిదెల

నిహారిక కొణిదెల నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’తో రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిహారిక ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకున్నారు. ప్రస్తుతం నిహారిక జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ని చిత్రయూనిట్ ప్రారంభించింది. ఈ సందర్భంగా శుక్రవారం నాడు ‘పదే పదే’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను సెయింట్ పీటర్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో.. ‘Padhe Padhe’…

Read more

‘రాకాస’ నుంచి మెలోడీ సాంగ్ ‘పదే పదే’ రిలీజ్

`ప‌దే ప‌దే ప్రాణం నిన్నే కోర‌గా క‌లే నిజం కాదా నిన్ను చేర‌గా ఒకే ఒక ఆశ చాలుగా నువ్వే చాలుగా ప్ర‌పంచ‌మే లేదే ప్ర‌తీ క్ష‌ణం నువ్వే నా క‌థ‌` అంటూ అమ్మాయి త‌న మ‌నసులోని ప్రేమ‌ను అబ్బాయికి చెప్ప‌టానికి ఎంతో ఆశ‌తో, ఆతృత‌గా ఎదురుచూస్తోంది. ఇంత‌కీ అమ్మాయి మ‌న‌సులో ప్రేమ‌ను సంపాదించుకున్న అబ్బాయి క‌థేంటో తెలుసుకోవాలంటే రాకాస సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.. https://youtu.be/hzK32ehIXy0 ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకుంది. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తరువాత జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో నిహారిక త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌గా ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని…

Read more

‘డేవిడ్ రెడ్డి’ కోసం న్యూ అవ‌తార్‌లో రెడీ అవుతోన్నమంచు మ‌నోజ్‌

మంచు మ‌నోజ్‌.. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. ఎప్పటిక‌ప్పుడు కొత్త‌ద‌నంతో ప్రేక్ష‌కుల‌ను ఆయ‌న ఆక‌ట్టుకుంటుంటారు. తాజాగా మ‌రోసారి సోష‌ల్ మీడియాలో ఆయ‌న చేసిన పోస్ట్ ఫ్యాన్స్ స‌హా ప్రేక్ష‌కుల‌ను, సినీ వ‌ర్గాల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. మ‌నోజ్ త‌న ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ గురించిన అప్‌డేట్‌ను ఆయ‌న షేర్ చేసుకున్నారు. రాబోయే సినిమాల కోసం గ‌త మూడు వారాలుగా క‌ఠినంగా శ్ర‌మిస్తున్నాన‌ని ఆయ‌న ఈ పోస్ట్‌లో వెల్ల‌డించారు. అలాగే ఆయ‌న పోస్ట్ చేసిన వ‌ర్క‌వుట్ ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. న‌టుడిగా మ‌నోజ్ చూపిస్తోన్న ప‌ట్టుద‌ల‌, కృషిని అందరూ అభినందిస్తున్నారు. https://www.instagram.com/p/DVtRzdhEix7 ఆ పోస్ట్‌లో మనోజ్ తన తీసుకున్న‌ నిర్ణయం గురించి చాలా నిజాయితీగా మాట్లాడారు. సౌకర్యంగా ఉండ‌టానికి సాకులు వెత‌కకుండా…

Read more

మార్చి 13 నుండి ZEE5 లో డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’..

మాస్ మహారాజ్ రవితేజ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ మూవీని ఎస్ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాలో రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి ప్రధాన పాత్రలు పోషించారు. కావాల్సినంత కామెడీ, గుండెల్ని తాకే ఎమోషన్స్‌ను మిళితం చేసి ఈ కథను కిషోర్ తిరుమల తెరపైకి తీసుకు వచ్చారు. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు రెడీగా ఉంది. మార్చి 13 నుంచి ఈ మూవీ జీ5 తెలుగులో స్ట్రీమింగ్ కాబోతోంది. దక్షిణాది భాషల్లో ఈ మూవీ డబ్బింగ్…

Read more

‘దండోరా’ ఇక్కడితో ఆగే సినిమా కాదు.. మున్ముందు చాలా అవార్డులు వస్తాయి.. – హీరో శివాజీ

తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘గద్దర్ అవార్డులు 2025’లో ‘దండోరా’ సత్తా చాటుకుంది. మూడు కేటగిరీల్లో ‘దండోరా’ అవార్డుల్ని కొల్లగొట్టేసింది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ నిర్మాణంలో మురళీకాంత్ ‘దండోరా’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు ముఖ్య పాత్రల్ని పోషించారు. తమ సినిమాకు ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు, ఇచ్చిన గుర్తింపు సందర్భంగా ఆదివారం నాడు చిత్రయూనిట్ థాంక్స్ చెబుతూ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ థాంక్యూ మీట్‌లో.. *శివాజీ మాట్లాడుతూ ..* ‘మా ‘దండోరా’ సినిమాని గుర్తించి అవార్డుల్ని ఇచ్చిన జ్యూరీకి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. ఎన్టీఆర్…

Read more

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ లాంటి మంచి సిరీస్‌లో భాగమవ్వడం నా అదృష్టం: రాజీవ్ కనకాల

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’లో ప్రతీ పాత్రకు మంచి పేరు వస్తుందని ముందే చెప్పాను.. బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌లో నిర్మాత శ్రీరామ్ వెంకట్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ చాలా ఏళ్ల వరకు కనిపిస్తుంది.. నిలబడుతుంది.. బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌లో జీ5 తెలుగు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ రాఘవన్ జీ5 తెలుగులో గత వారం వచ్చిన వెబ్ సిరీస్ . ఈ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఉదయభాను, వాసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ వెబ్ సిరీస్‌ను జీ5 తెలుగు నిర్మించింది. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు…

Read more

మూడేళ్ల వివాహా బంధాన్ని ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్న మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి

మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి ఈ రోజు (మార్చి 3) తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మధ్య ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. సినిమా, ఫ్యామిలీ మధ్య ఉన్న రిలేషన్ కారణంగా ఈ ఇద్దరూ ఒక్కటయ్యారని అంతా అనుకుంటారు. కానీ ఇద్దరిలో ఉన్న క్రమశిక్షణ, జీవిత లక్ష్యాల కారణంగా ఒక్కటయ్యారు. అలా పరిచయం ప్రేమగా మారి ఇద్దర్నీ జీవిత ప్రయాణంలో ఒకే దారికి తీసుకు వచ్చింది. మూడు సంవత్సరాల వైవాహిక బంధం తర్వాత మనోజ్ - భూమ కుటుంబం మరింత అందంగా పెరిగింది. కుమారుడు ధైరవ్‌తో పాటు ఏప్రిల్ 2, 2024న జన్మించిన దేవసేన శోభ ఎంఎంతో మనోజ్, మౌనికల జీవితం మరింత అందంగా,…

Read more

*75 గంటల్లోనే 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోయిన జీ5 తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’

జీ5 తెలుగులో గత వారం వచ్చిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ఈ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్ని పోషించారు. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. https://www.instagram.com/p/DVYkUGYAd4N స్ట్రీమింగ్ అయిన 75 గంటల్లోనే ఈ సిరీస్‌కి 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దక్కాయి. అంటే ఈ సిరీస్‌ను ప్రేక్షకులు ఏ రేంజ్‌లో చూస్తున్నారో, ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇది డిటిటల్…

Read more

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్ ప్రతీ ఒక్క తండ్రికి కనెక్ట్ అవుతుంది.. నిర్మాత కె.వి. శ్రీరామ్

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ని ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ సిరీస్‌లోని రెండు ఎపిసోడ్స్‌ని మీడియాకి ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో.. రాజీవ్ కనకాల మాట్లాడుతూ .. ‘‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్‌కి పని…

Read more