Skip to content

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌తో మంచు మనోజ్, మౌనిక భేటీ

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనిక భూమా మంచు తమ వ్యాపార ప్రస్థానాన్ని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరిద్దరూ న్యూఢిల్లీలోని హిమాచల్ సదన్‌లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ కవిందర్ గుప్తాను కలిశారు. ఈ సందర్భంగా సినిమా, స్పోర్ట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. వినోద రంగంతో పాటు క్రీడా రంగంలోనూ కొత్త అవకాశాలను అన్వేషిస్తున్న మంచు మనోజ్, మౌనిక భూమా మంచు.. తమ వ్యాపార దృష్టిని మరింత విస్తరించే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చర్చించిన ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు. దీంతో ఈ భేటీ వెనుక ఉన్న అసలు ప్రణాళికలపై ఆసక్తి నెలకొంది…

Read more

A Larger Vision Takes Shape: Manoj Manchu and Mounika Bhuma Manchu Meet Himachal Pradesh Governor

Manoj Manchu and Mounika Bhuma Manchu met Himachal Pradesh Governor Shri Kavinder Gupta at Himachal Sadan in New Delhi for discussions on cinema and sports infrastructure. The meeting forms part of the couple’s broader entrepreneurial vision, with both actively exploring opportunities across entertainment and sports. While specific project details remain undisclosed, the discussions offer a glimpse of the scale of their ambitions. Cinema, infrastructure and sporting opportunity are emerging as key areas of focus for Manoj and Mounika, with further…

Read more

భారతదేశంలో సరికొత్తగా Zee 5 స్పెషల్ ఫీచర్స్ !

ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న వినోద సాధనాలు మునుపెన్నడూ లేనంతగా పెరుగుతున్న ఈ తరుణంలో, ప్రముఖ ఓటీటీ దిగ్గజం జీ5 (Zee 5) సరికొత్తగా అడుగులేస్తోంది. తన కంటెంట్ పరిధిని మరింతగా విస్తరిస్తూ, ప్లాట్‌ఫారమ్‌లో అత్యంత కీలకమైన, విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తోంది. మొబైల్, కనెక్టెడ్ టీవీ (Connected TV) వినియోగదారుల కోసం అత్యాధునిక ఏఐ (AI) ఆధారిత పర్సనలైజేషన్, ఆకర్షణీయమైన విజువల్ నావిగేషన్, స్లాట్-రహిత క్రాస్-స్క్రీన్ అనుభవాలతో ప్లాట్‌ఫారమ్‌ను అప్‌గ్రేడ్ చేసింది. భారతీయ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ కొత్త జీ5.. ఐదు విభిన్న విభాగాలతో (ప్రీమియం ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్రీ 5, కిడ్జ్, టీవీ, స్పోర్ట్స్) వినోదాన్ని వెతకడాన్ని మరింత సులభంగా, లీనమయ్యేలా మార్చింది. న్యూ జీ 5 ప్రత్యేకతలు చూస్తే.. ఏఐ…

Read more

15 ఏళ్ల నా కల పంచనామాతో నెరవేరింది – ఉదయభాను

తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే 'పంచనామా' సిరీస్. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌‌లో 6 ఎపిసోడ్స్‌ ఉండనున్నాయి. హైదరాబాద్‌లో బుధవారం ప్రివ్యూ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత, షో రన్నర్ ఉదయభాను మాట్లాడుతూ.. ఈరోజు నేను ఎమోషనల్ అవ్వకూడదని అనుకున్నాను. నిర్మాతగా మారాలనేది నా సాధారణ కల కాదు. దాదాపు 15 ఏళ్లుగా ఒక తపస్సు చేస్తున్నాను. టెలివిజన్‌లోనే పుట్టాను, ఉదయభాను కాస్తా హృదయభానుగా మారింది అక్కడే.…

Read more

‘హైకూ’ టీజర్ రిలీజ్

‘హైకూ’ టీజర్‌ను లాంచ్ చేసిన రొమాంటిక్ స్టార్ హరీష్ కళ్యాణ్.. సిద్ధు కుమార్ మెలోడీ మ్యూజిక్, దర్శకుడు యువరాజ్ చిన్నసామి ఫ్రెష్ ప్రజెంటేషన్‌తో ఆకట్టుకుంటోన్న సినిమా విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై ఏగన్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ రొమాంటిక్ హీరో హరీష్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్, యూత్‌ఫుల్ ట్రీట్‌మెంట్, పొయెటిక్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ టీజర్ చూడగానే ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయమైన విజువల్స్‌తో పాటు ఫ్రెష్ టేకింగ్‌తో ఈ ప్రేమకథను దర్శకుడు కొత్తగా ప్రజెంట్ చేశారు. వావ్ అనిపించే ఫ్రేమ్స్, ఆహ్లాదకరమైన సన్నివేశాలు, లవ్ ఎమోషన్స్‌తో నిండిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. నేటి ట్రెండ్‌కు తగ్గ కథ, కథనం, బ్యూటీఫుల్ ప్రెజెంటేషన్‌తో…

Read more

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘పంచనామా’ ట్రైలర్

తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే 'పంచనామా' సిరీస్. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌‌లో 6 ఎపిసోడ్స్‌ ఉండనున్నాయి. ఉత్కంఠభరితమైన దర్యాప్తుతో పాటు భావోద్వేగాలు, మిస్టరీ, క్రైమ్ అంశాలను ఈ సిరీస్‌లో ఆసక్తికరంగా మేళవించారు. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. ఆది, ప్రవీణ్, జోసెఫ్ అనే ముగ్గురు అత్యంత దారుణంగా చనిపోతారు. అయితే వీళ్ల చావులను యాక్సిడెంటల్ డెత్‌గా క్లోజ్ చేస్తారు. కానీ ఈ ముగ్గురువి యాక్సిడెంటల్ చావులు…

Read more

కూకట్‌పల్లిలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు హాజరైన సాయి దుర్గా తేజ్

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా కూకట్‌పల్లిలోని గోపాల్ నగర్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ప్రముఖ హీరో సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వేడుకల్లో పాల్గొని, అక్కడికి వచ్చిన చిన్నారులతో ముచ్చటించారు. చిన్నారులతో కలిసి సాయి దుర్గా తేజ్ కేక్ కట్ చేసి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన…

Read more

‘వేట’..పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

ఎస్ఆర్‌డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వేట’. సందీప్ సరోజ్, సాత్విక జంటగా ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీని సోమవారం (ఆగస్ట్ 31) నాడు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాలకు కొణిదెల నాగబాబు, కేఎస్ రవి కుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్‌కేఎన్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు స్క్రిప్ట్ అందజేయగా.. కేఎస్ రవి కుమార్ క్లాప్ కొట్టారు. సాయి రాజేష్, ఎస్‌కేఎన్, వీఎన్ ఆదిత్య, ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో మెహర్ రమేష్, యదు వంశీ, అనుదీప్ దేవ్ పాల్గొన్నారు…

Read more

సరికొత్త ఒరిజినల్స్ తో ప్రేక్షకులకు చేరువ కానున్న తెలుగు జీ5

ఎన్‌బీకే111, వృషకర్మ, జనవరి 12 విడుదల నుంచి పంచనామా, జయమ్ము నిశ్చయమ్మురా 2 వరకు.. దక్షిణాది ప్రేక్షకుల మనసుకు చేరువయ్యే విభిన్నమైన, నెటివిటీ కథలతో ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త వినోదాన్ని అందించ‌నున్న తెలుగు జీ5 భారతీయ వినోద రంగం భవిష్యత్ వైవిధ్య‌మైన భాషాల‌తో, క్రియేటివిటీతో, కొత్త హ‌ద్దుల‌ను నిర్దేశిస్తూ ముందుకు సాగుతోంది. ఈ జ‌ర్నీలో క్రియేట‌ర్స్ ప్ర‌తిభ ఎంతో కీల‌కంగా మారింది. అందులో భాగంగా ఇప్పుడు తెలుగు జీ5 తన కంటెంట్‌ను మరో స్థాయికి తీసుకెళ్తూ.. ఐకానిక్ ఫ్రాంచైజీలు, ఒరిజినల్ సిరీస్‌లు, భారీ చిత్రాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, గతంలో ఎన్నడూ లేనంత విస్తృతమైన వినోద అనుభవాలతో కూడిన భారీ కంటెంట్ లైనప్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇండస్ట్రీలో అత్యంత నిబద్ధతతో, నాణ్యమైన కంటెంట్‌ను ఆదరించే…

Read more

రోజా క‌మ్ బ్యాక్ ఫిల్మ్ ‘అన్బే డ‌యానా’.. సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అన్బే డయానా’ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఇప్పుడు సోనీ లివ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమ, కామెడీ, మ‌న నెటివిటీకి, మ‌న‌ సంస్కృతి, కుటుంబ అనుబంధాల మేళవింపుగా రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు మరింత విస్తృత ప్రేక్షకులకు చేరువ కానుంది. ప్రేక్షకులు తమ ఇంటి నుంచే ఈ అందమైన కథను ఆస్వాదించే అవకాశం. చెన్నైలోని పెరంబూర్ నేపథ్యంగా తెరకెక్కిన ‘అన్బే డయానా’ సినిమా కథ, సంప్రదాయాలకు కట్టుబడి ఉండే ఓ యువకుడి జీవితంలో చోటుచేసుకునే ఊహించని మలుపుతో ఏం జరిగింద‌నే పాయింట్‌ చుట్టూ సాగుతుంది. స్వేచ్ఛగా జీవించే ఓ ఆంగ్లో-ఇండియన్ యువతితో అతడు ప్రేమలో పడటంతో రెండు విభిన్న ప్రపంచాలు…

Read more