Skip to content

‘హైకూ’ మనల్ని ఎగ్జైట్ చేసే సిన్సియ‌ర్ ల‌వ్ స్టోరి: కోన వెంకట్

ఏగ‌న్‌, కోర్ట్ ఫేమ్ శ్రీదేవి, ఫెమినా జార్జ్ హీరో హీరోయిన్లుగా విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై రూపొందుతోన్న‌ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’.యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వంలో డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 23న మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన రిలీజ్ ప్రెస్‌మీట్‌కు ప్రముఖ ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంక‌ట్, డైరెక్టర్ రామ్ జగదీశ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా…

హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా నా హార్ట్ కి చాలా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా కథ వినగానే బాగా నచ్చి వెంటనే ఓకే చేశా. లవ్ లో ఉన్నా, రిలేషన్ షిప్ లో ఉన్నా, మ్యారీడ్ కపుల్ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. లవ్ ఉన్న కాంప్లికేషన్స్ మొత్తం ఈ సినిమాలో చూస్తారు. ఏగన్ డౌన్ తో ఎర్త్. ఆయనతో కలిసి పని చేయడం హ్యాప్పీగా అనిపించింది. నన్ను చాలా కూల్ గా హ్యాండిల్ చేసిన డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. మా టీం మొత్తం కూడా ఎంతో సహకరిస్తూ పని చేశారు. ఇది నా ఫస్ట్ డెబ్యూ. మీరంతా అక్టోబర్ 23 న థియేటర్ లో ఎంజాయ్ చేయండి’’’ అన్నారు.

హీరో ఏగన్ మాట్లాడుతూ.. ‘‘నేను ఇండస్ట్రీకి కొత్త. హైకూ సినిమా క్లోజ్ తో మై హార్ట్. బాగా కష్టపడి సినిమా చేశాము. ఈ సినిమాపై నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. మ్యూజిక్ డైరెక్టర్ సిద్దు కుమార్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్ యువరాజ్ చిన్నస్వామి నాకు పదేళ్లుగా తెలుసు. ఇప్పుడే మేమిద్దరం కలిసి సినిమా చేశాము. 200 పర్సెంట్ హైదరాబాద్ లో మళ్ళీ హైకూ సక్సెస్ మీట్ లో కలుద్దాం’’ అన్నారు.

డైరెక్టర్ రామ్ జగదీశ్ మాట్లాడుతూ.. ‘‘హైకూ తమిళ సినిమా ఇప్పుడు తెలుగులోకి వస్తోంది. హైకూ కి నా పర్సనల్ స్పెషల్ ఇంట్రెస్ట్ జాబిలీ (శ్రీదేవి). ఆమెకు ఇది తమిళ్ డెబ్యూ. ఆవిడ కళ్ళతో ఏ భాష అయినా మాట్లాడగలడు. ఈ సినిమా కోసం ఆమె చాలా కష్టపడింది. సినిమా ఔట్ పుట్ చాలా ప్లెసెంట్ గా వచ్చింది. యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. ఆల్ ది బెస్ట్ టు టీమ్’’’ అన్నారు.
కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘‘హైకూ అక్టోబర్ 23 న వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ చూడగానే కూల్‌గా, ఆహ్లాదంగా అనిపించింది. ముందే ఓటీటీకి అమ్మేసి అప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం నిజంగా గ్రేట్. నెట్ ఫ్లిక్స్ వారికీ స్టోరీ చెప్పి ఈ హైకూ తీశారంటే వాళ్ళని ఈ స్క్రిప్ట్ ఎంత మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కథ కచ్చితంగా అందరినీ ఎగ్జైట్ చేస్తుంది. ఇది ఒక సిన్సియర్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో కాలేజ్ లైఫ్ లోని బ్యూటిఫుల్ థింగ్స్ చూపించారు. మనల్ని మళ్ళీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా ఇది. స్పెషల్ గా ఈ సినిమాను శ్రీదేవి కోసం చూడాలి. ఏగన్ వెల్ కమ్ టు తెలుగు ఇండస్ట్రీ’’’ అన్నారు.

“HAIKU” Telugu Pre Release Press Meet – https://youtube.com/playlist?list=PLafPPgStwk88&si=Yx18rCMtSXT8nMIc

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.