బ్లాక్‌బస్టర్ సక్సెస్ 'కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' తర్వాత న్యాచురల్ స్టార్ నాని…
‘సుమో దీదీ’.. ట్రైలర్ రిలీజ్ చేసిన జీ5 హిందీ
- భారతదేశపు తొలి ప్రొఫెషనల్ మహిళా సుమో రెజ్లర్ హేటల్ డేవ్ జీవిత ప్రయాణం స్ఫూర్తిగా తెరకెక్కిన సినిమా –
మహిళల బలం, అందం, విజయాలను సమాజం కొన్ని నిర్దిష్ట ప్రమాణాలతో అంచనా వేసే ఈ రోజుల్లో.. ఆ అంచనాలను దాటి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహిళ కథే ‘సుమో దీదీ’. భారతదేశపు తొలి ప్రొఫెషనల్ మహిళా సుమో రెజ్లర్ హేటల్ డేవ్ అసాధారణ జీవిత ప్రయాణం ఆధారంగా తెరకెక్కిన ఈ స్ఫూర్తిదాయక స్పోర్ట్స్ బయోపిక్ ట్రైలర్‌ను జీ5 హిందీ విడుదల చేసింది.
జియో స్టూడియోస్, ఫ్రెష్ లైమ్ ఫిల్మ్స్, MA+TH ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జ్యోతి దేశ్‌పాండే, ఆకాష్ చావ్లా, అరుణవ సేన్‌గుప్తా, అమిత్ చంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జయంత్ రోహత్గి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రియం భగ్నాని టైటిల్ రోల్‌లో నటించగా, చైతన్య శర్మ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 23, 2026 నుంచి జీ5 హిందీలో ఈ చిత్రం ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది.
‘సుమో దీదీ’ కథలో ప్రధానంగా కనిపించేది.. సమాజం తన భవిష్యత్తును నిర్ణయించడాన్ని అంగీకరించకుండా పోరాటం చేసిన ఓ మహిళ ప్రయాణం. సుమో రెజ్లింగ్ అనే విభిన్నమైన క్రీడలో తన లక్ష్యాన్ని వెతుక్కుంటూ హేటల్ సాగించే ప్రయాణమే ఈ సినిమా. మహిళల శరీరం, సామర్థ్యం, వారి శక్తి గురించి సమాజంలో ఉన్న అభిప్రాయాలను సవాలు చేస్తుంది. హేటల్ డేవ్ పాత్రలో శ్రియం భగ్నాని నటించే క్రమంలో.. ఆమె పట్టుదలను, భావోద్వేగాలతో కూడిన జీవిత ప్రయాణాన్ని తెరపై ఆవిష్కరించారు. చైతన్య శర్మ, అనుభా ఫతేపురియా, నితీష్ పాండే, రాఘవ్ ధీర్, మీనల్ కపూర్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. జపాన్, కోల్‌కతా, ముంబైలోని నిజమైన ప్రదేశాల్లో ‘సుమో దీదీ’ చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రం టోక్యో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, పామ్ స్ప్రింగ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లోనూ ప్రదర్శితమైంది.
ఈ సందర్భంగా.. దర్శకుడు జయంత్ రోహత్గి మాట్లాడుతూ.. “పట్టుదల, మనోధైర్యంతో కష్టాలను అధిగమించి, నిరాశ నుంచి బయటపడి విజయం వైపు అడుగులు వేసిన ఓ మహిళ స్ఫూర్తిదాయక ప్రయాణమే ‘సుమో దీదీ’. సంప్రదాయాలకు కట్టుబడి ఉండే మార్వాడీ కుటుంబానికి చెందిన ఓ యువతి.. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని, సమాజం తన బలహీనతగా భావించిన విషయాన్నే తన బలంగా మార్చుకుంటుంది. తన ఎదుగుదలకు అడ్డుగా నిలిచిన హద్దులను చెరిపేస్తుంది. మూఢమైన భావజాలం, సామాజిక ఒత్తిళ్లు, లింగ వివక్ష, మహిళల శరీరాలపై సమాజానికి ఉన్న అభిప్రాయాలను ధైర్యంగా సవాలు చేసిన హేటల్ కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. కోల్‌కతాలోని ఇరుకు వీధుల నుంచి జపాన్‌లోని ప్రశాంతమైన పల్లె ప్రాంతాల వరకు ఆమె సాగించిన ప్రయాణం ఎంతో సహజంగా, అద్భుతమైన దృశ్యాలతో తెరకెక్కింది. హేటల్ పాత్రకు ప్రాణం పోయడానికి శ్రియం శారీరకంగా, భావోద్వేగపరంగా ఎంతో కష్టపడ్డారు. ఆమెకు నా కృతజ్ఞతలు. ఈ కథను నమ్మి మాకు అండగా నిలిచిన జియో స్టూడియోస్, ఫ్రెష్ లైమ్ ఫిల్మ్స్, MA+TH ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్, జీ5 సంస్థలకు ధన్యవాదాలు. మా సినిమా కేవలం హేటల్ ఓ గొప్ప సుమో రెజ్లర్‌గా ఎదిగిన కథ మాత్రమే కాదు.. తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకోవడం, తన శరీరంపై తనకు హక్కు ఉందని చాటుకోవడం, తనలోని శక్తిని గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం గురించి చెప్పే కథ” అన్నారు.
నటి శ్రియం భగ్నాని మాట్లాడుతూ.. “నాకు లీడ్ రోల్‌గా ఇదే తొలి సినిమా. ఇంతటి బాధ్యతను తీసుకోవడమే పెద్ద సవాలంటే, ఇందులోని పాత్ర కూడా ఎంతో క్లిష్టమైనది. మొదట ఈ ప్రయాణం చాలా కష్టంగా అనిపించింది. ఈ నెలలోనే సినిమా విడుదలవుతుందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. హేటల్ డేవ్ పాత్రలో నటించడం నా జీవితంలోనే అత్యంత సవాలుతో కూడుకుంది. మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చిన సినిమా. కథ కేవలం ఓ సుమో రెజ్లర్‌గా ఎదిగిన ప్రయాణం మాత్రమే కాదు.. నువ్వు అందరికంటే భిన్నమైనదానివి అంటూ ప్రపంచం నిరంతరం చెబుతున్నా, మనల్ని మనం నమ్మడం ఎంత ముఖ్యమో తెలియజేసే కథ. ఈ పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అయితే, బలం, పట్టుదల గురించి నేను ఆలోచించే విధానాన్ని కూడా ఈ పాత్ర మార్చేసింది. చిత్రీకరణ పూర్తయిన తర్వాత కూడా హేటల్ కథ నాతోనే ఉంది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులు హేటల్ ప్రయాణాన్ని తెలుసుకుని, ఆమె కథ నుంచి స్ఫూర్తి పొందాలని, ఆమెలోని ధైర్యంలో కొంతైనా తమతో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అక్టోబర్ 23న జీ5 హిందీలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులకు మా సినిమా చేరువ కానుండటం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని అన్నారు.
హేటల్ డేవ్ మాట్లాడుతూ.. “మనలో చాలామందికి జీవితంలో ఏదో ఒక సమయంలో మనం ఇతరులకంటే భిన్నంగా ఉన్నామని, మనలో ఏదో ఒకటి మార్చుకోవాలని, కొన్ని కలలు మన కోసం కాదని ఇతరులు చెప్పే ఉంటారు. సుమో రెజ్లింగ్‌లో నా ప్రయాణంలోనూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. అయితే, నన్ను నేను నమ్ముతూ ముందుకు సాగడం ఎలాగో ఈ ప్రయాణం నేర్పించింది.
‘సుమో దీదీ’ ప్రత్యేకత ఏమిటంటే.. ఈ సినిమా కేవలం క్రీడకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రపంచం మనల్ని మరోలా ఉండాలని ఆశించినప్పుడు కూడా మన నిర్ణయాలకు కట్టుబడి ఉండటం ఎంత ముఖ్యమో చెబుతుంది. నా కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న జీ5 హిందీకి కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ తమను తాము అంగీకరించి, తమకు నచ్చిన లక్ష్యాలను సాధించే దిశగా ముందడుగు వేయడానికి ఈ సినిమా స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నా” అన్నారు.
చైతన్య శర్మ మాట్లాడుతూ.. “క్రీడా నేపథ్యంలో తెరకెక్కినప్పటికీ, ‘సుమో దీదీ’లో ఆశయాలు, బంధాలు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగాలనే ధైర్యం వంటి ఎన్నో భావోద్వేగాలతో కూడిన మానవీయ కథ ఉంది. అందుకే ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. హేటల్ ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఎవరూ ఊహించని, ఎంతో కష్టమైన మార్గాన్ని ఆమె ఎంచుకుంది. తన బలహీనతగా భావించేలా ఇతరులు చేసిన విషయాన్నే తన అతిపెద్ద బలంగా మార్చుకుంది. ఈ సినిమా కోసం జయంత్ రోహత్గి, శ్రియంతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం. జయంత్ ఎంతో నిజాయతీగా కథను చెప్పే దర్శకుడు. ఇలాంటి కథకులు చాలా అరుదుగా కనిపిస్తారు. ఇక శ్రియం నేను కలిసి పనిచేసిన నటీమణుల్లో అత్యంత స్ఫూర్తినిచ్చిన వారిలో ఒకరు. ఈ పాత్రను విజయవంతంగా పోషించడానికి ఆమె చూపించిన పట్టుదల, అంకితభావం నిజంగా అభినందనీయం. ప్రేక్షకులు ఈ కథను చూసి, మేము సృష్టించిన ప్రపంచాన్ని అనుభూతి చెందాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. జీ5 హిందీలో ఈ సినిమా ప్రీమియర్ కానుండటం ఆనందంగా ఉంది” అని అన్నారు.
సమాజం తన బలహీతన అనుకున్న విషయాన్ని బలంగా మార్చుకుని ముందుకు సాగిన సూర్ఫిదాయకమైన మహిళ ప్రయాణాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి. అక్టోబర్ 23, 2026 నుంచి జీ5 హిందీలో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానున్న ‘సుమో దీదీ’ని వీక్షించండి.
జీ5 గురించి:
జీ5 భారతదేశంలోనే అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ వేదిక. దక్షిణాసియా కంటెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేస్తూ 190కి పైగా దేశాల్లో సేవలందిస్తోంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు చెందిన ఈ ఓటీటీ వేదిక.. స్థానిక భాషలు, ప్రాంతీయ అభిరుచులకు ప్రాధాన్యతనిస్తూ విభిన్నమైన వినోదాన్ని అందిస్తోంది.
హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మలయాళం, కన్నడ, మరాఠీ భాషల్లో ఒరిజినల్స్, భారతీయ, అంతర్జాతీయ చిత్రాలు, టీవీ షోలు, లైవ్ స్పోర్ట్స్, పిల్లల కార్యక్రమాలు, వార్తలు, లైవ్ టీవీ, మైక్రో డ్రామాలతో కూడిన విస్తృతమైన కంటెంట్ లైబ్రరీ జీ5 సొంతం. విభిన్న భాషలు, అభిరుచులకు అనుగుణంగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఫిఫాతో 2034 వరకు కుదుర్చుకున్న దీర్ఘకాలిక భాగస్వామ్యంలో భాగంగా.. భారత్‌లో ఫిఫా నిర్వహించే ప్రధాన ఫుట్‌బాల్ టోర్నమెంట్లను కూడా జీ5 ప్రసారం చేయనుంది. ఇందులో 2026, 2030 ఫిఫా ప్రపంచకప్‌లు కూడా ఉన్నాయి.
Sumo Didi | Official Trailer | https://youtu.be/hJL9MdogzTk

