Skip to content

రోజా సెల్వ‌మ‌ణి క‌మ్ బ్యాక్ ఫిల్మ్ ‘అన్బే డ‌యానా’..సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అన్బే డయానా’ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఇప్పుడు సోనీ లివ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమ, కామెడీ, మ‌న నెటివిటీకి, మ‌న‌ సంస్కృతి, కుటుంబ అనుబంధాల మేళవింపుగా రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు మరింత విస్తృత ప్రేక్షకులకు చేరువ కానుంది. ప్రేక్షకులు తమ ఇంటి నుంచే ఈ అందమైన కథను ఆస్వాదించే అవకాశం. చెన్నైలోని పెరంబూర్ నేపథ్యంగా తెరకెక్కిన ‘అన్బే డయానా’ సినిమా కథ, సంప్రదాయాలకు కట్టుబడి ఉండే ఓ యువకుడి జీవితంలో చోటుచేసుకునే ఊహించని మలుపుతో ఏం జరిగింద‌నే పాయింట్‌ చుట్టూ సాగుతుంది. స్వేచ్ఛగా జీవించే ఓ ఆంగ్లో-ఇండియన్ యువతితో అతడు ప్రేమలో పడటంతో రెండు విభిన్న ప్రపంచాలు…

Read more

‘ఘమాసాన్’ సెప్టెంబర్ 11న జీ5లో స్ట్రీమింగ్‌

అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఇషితా ద‌త్తా ప్ర‌ధాన పాత్ర‌ల్లో టిగ్మాన్షు ధూలియా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం - బలమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఒకే ఆలోచనతో ఏర్పడే క్రియేటివ్ కాంబినేష‌న్స్‌ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తాయి. వైవిధ్యమైన కథలను ప్రోత్సహించడం, ధైర్యమైన సృజనాత్మక నిర్ణయాలు తీసుకోవడం, ప్రేక్షకులను కేంద్రంగా చేసుకుని వినోదాన్ని అందించాలనే ఆలోచనతో జీ5, జియో స్టూడియోస్, గోల్డెన్ రేషియో ఫిల్మ్స్ కలిసి ఓ ప్రత్యేకమైన కథతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. ఆ సినిమాయే ‘ఘమాసాన్’. ప్రతీక్ గాంధీ, అర్షద్ వార్సీ, ఇషితా దత్తా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ను జీ5, జియో స్టూడియోస్, గోల్డెన్ రేషియో ఫిల్మ్స్ బుధ‌వారం రోజున విడుదల చేశాయి. ఈ చిత్రం…

Read more

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన నాగేంద్రబాబు

మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని (ఆగస్టు 22) పురస్కరించుకుని ప్రముఖ నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు (MLC), ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగేంద్రబాబు గారు హైదరాబాద్‌లోని కోకాపేటలో మొక్కలు నాటి వినూత్నంగా వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కదంబ వృక్షం (కదంబవాసిని) మొక్కను నాటారు. ఈ జాతి మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ 1.5 నుండి 2 సంవత్సరాల వయసున్న ఈ మొక్క ఏపుగా పెరిగి, దట్టమైన పచ్చదనంతో పాటు దాదాపు 10 నుంచి 15 డిగ్రీల వరకు వేడిని తగ్గించే చల్లని నీడను అందిస్తుందని, అలాగే టెన్నిస్ బాల్ ఆకారంలో సువాసనభరితమైన పూలను పూస్తుందని నాగబాబు తెలిపారు…

Read more

*ఆగ‌స్ట్ 28 నుంచి జీ5లో ‘బంద‌ర్‌’ స్ట్రీమింగ్‌

కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సాన్యా మల్హోత్రా, సప్నా పబ్బీ, సబా ఆజాద్‌.. #MeTooForMen అనే వైవిధ్య‌మైన కథతో ఆరోపణలు, అభిప్రాయాలు, న్యాయం చుట్టూ సాగే సినిమా - వైవిధ్య‌మైన కథాంశాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి జీ5 ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు బంద‌ర్ అనే డిఫ‌రెంట్ మూవీతో అల‌రించ‌టానికి సిద్ధ‌మైంది. వివాహ బంధంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసం ఓ మహిళ చేసే పోరాటాన్ని ఆవిష్కరించిన ‘మిసెస్‌’ అనే సినిమా నుంచి.. అత్యాచార ఘటనలు, బాధితులనే నిందించడం, న్యాయం కోసం మహిళలు ఎదుర్కొనే సవాళ్లను ప్రశ్నించిన ‘అస్సి’ వరకు.. సంప్రదాయ మూస ధోరణులను అనుసరించడం కంటే వాటిని ప్రశ్నించే కథలకు హిందీ జీ5 ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. ఇప్పుడు ‘బందర్‌’తో నేటి స‌మాజంలో అత్యంత…

Read more

ఆగ‌స్ట్ 23 నుంచి తొలి త‌మిళ ఐడిల్ ఆడిష‌న్స్ ప్రారంభం

సూపర్ జడ్జ్ ఎ.ఆర్. రెహమాన్‌ ప్రకటనతో తొలి ‘తమిళ్ ఐడల్‌’ ఆడిషన్స్‌కు శ్రీకారం చుట్టిన ‘సోనీ విళా’, ‘సోనీ లివ్‌’ సంయుక్తంగా తమిళనాడులో తదుపరి సింగింగ్ సెన్సేషన్ కోసం అతిపెద్ద ప్రతిభాన్వేషణకు అడుగులు వేయ‌టం ప్రారంభించింది. ఈ క్ర‌మంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. తమిళనాడులో తదుపరి సంగీత సంచలనాన్ని వెలికితీసేందుకు నిర్వహిస్తోన్న‌ అతిపెద్ద ప్రతిభాన్వేషణకు చెన్నై వేదిక కానుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ‘తమిళ్ ఐడల్‌’ తొలి ఆడిషన్స్‌ ఆగ‌స్టు 23న ప్రారంభం కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ జ‌ర్నీలో భాగంగా సూపర్ జడ్జ్ ఎ.ఆర్. రెహమాన్‌ ప్రకటించిన ‘తమిళ్ ఐడల్‌’.. తమిళనాడులోని యువ, ఔత్సాహిక గాయకులను తమ ప్రతిభను చాటుకుని, జీవితంలో మరచిపోలేని అద్భుతమైన సంగీత ప్రయాణానికి తొలి…

Read more

‘జననాయకుడు ’ జీ5లో ఆగ‌స్ట్ 21 నుంచి స్ట్రీమింగ్‌

తమిళ్ జీ5లో ప్లాట్‌ఫామ్‌లోని అత్యంత ఆసక్తికరమైన బహుభాషా కంటెంట్‌, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్లాక్‌బస్టర్‌ ‘జననాయకుడు(జ‌న‌నాయ‌గ‌న్‌)’ కి గుర్తింపు ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించిన తమిళ్ ZEE5 కంటెంట్ స్లాట్‌లో నుంచి కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. ఈ క్ర‌మంలో అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న‌ ‘జననాయకుడు(జ‌ననాయ‌గ‌న్‌)’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. హెచ్. వినోద్‌ దర్శకత్వంలో, త‌మిళ‌నాడు గౌరవనీయులైన సీఎం సి.జోసెఫ్ విజయ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఆగ‌స్టు 21న తమిళ్ ZEE5లో ప్రీమియర్‌ కానుంది. ఇది తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. దీంతో దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన భాషల ప్రేక్షకులను ఈ ప్రతిష్ఠాత్మక సినిమా అలరించనుంది. ‘జననాయకుడు’ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాగానే కాకుండా…

Read more

21 నుంచి సోనీ లివ్‌లో ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రీమియర్

ఫస్ట్ లవ్‌ను సరికొత్తగా ఆవిష్కరిస్తూ, హృదయాన్ని హత్తుకునే కథనంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ రొమాంటిక్ డ్రామా ఆగ‌స్టు 21న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హృదయాన్ని హత్తుకునే కథనం, మనసుకు హాయినిచ్చే సంగీతం, ఆకట్టుకునే నటీనటుల పెర్ఫార్మెన్స్‌తో థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా రూ.60 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రవి నంబూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రవి నంబూరి, సాయి రాజేష్ నీలం స్క్రీన్‌ప్లే అందించారు. సాయి రాజేష్ కథను అందించగా.. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ…

Read more

సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌కు హోస్ట్‌గా హీరోయిన్‌ సమంత

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన కుకింగ్ ఫార్మాట్‌కు తమిళ నేటివిటీతో సరికొత్త రూపం.. సోనీ విళా, సోనీ లివ్‌లో ఆహారం, రుచులు, భావోద్వేగాలు, అనుబంధాలను సెలబ్రేట్ చేయడానికి తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులను ఒక్కచోటికి తీసుకొస్తున్న సమంత రూత్ ప్రభు - సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా తాజాగా ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ కుకింగ్ ఫార్మాట్‌ను తమిళ ప్రేక్షకుల కోసం సోనీ విజా, సోనీ లివ్‌లో స్టార్ హీరోయిన్‌ సమంత రూత్ ప్రభు హోస్ట్ చేస్తుండ‌టం విశేషం. సెలబ్రిటీలు, ఫుడ్, కాంపిటీషన్‌.. ఈ మూడు ప్రపంచాలను ఒకే ద‌గ్గ‌ర‌కి తీసుకొస్తూ ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌’ రూపొందుతోంది. తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన పలువురు…

Read more

ఆస్మాన్’తో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను – శాంతి శ్రీహరి

శ్రీమతి. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ మీద మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’. ఈ సినిమాని వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, అర‌బిక్ భాష‌ల్లో రూపొందుతోంది. స్వ‌ర్గీయ న‌టుడు శ్రీహరి జయంతి సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను శనివారం నాడు రిలీజ్ చేశారు. మోష‌న్ పోస్ట‌ర్ వీడియో గ‌మ‌నిస్తే.. సినిమాపై ఆస‌క్తి క‌లుగుతోంది. పెద్ద అర‌చేయి మ‌ధ్య‌లో హీరో మేఘాంశ్ కాగ‌డా ప‌ట్టుకుని నిల‌బ‌డి ఉన్నాడు. ఆ అర‌చేయికి సంబంధించిన నుదురు, దానిపై డిఫ‌రెంట్‌గా డిజైన్ చేసిన బొట్టును కూడా మోష‌న్ పోస్ట‌ర్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. అర‌చేయి చుట్టూ జ‌నాలంద‌రూ కాగడాల‌ను…

Read more

నాన్న‌గారిలా న‌న్ను కూడా ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను: మేఘాంశ్ శ్రీహ‌రి

శ‌నివారం (ఆగ‌స్ట్ 15) స్వ‌ర్గీయ న‌టుడు శ్రీహ‌రి జ‌యంతి. ప్ర‌తీ ఏడాదిలాగానే ఆయ‌న జ‌యంతిని బాచుప‌ల్లిలోని మండ‌పం ద‌గ్గ‌ర ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇదే ప్రాంతంలోనే శ్రీహ‌రి కుమార్తె అక్ష‌ర స్మార‌క ప్రాంతం కూడా ఉంటుంది. శ్రీహ‌రి జ‌యంతి నిర్వ‌హ‌ణ కార్య‌క్ర‌మంలో శాంతి శ్రీహ‌రి, హీరో మేఘాంశ్ శ్రీహ‌రి, శ‌శాంక్ శ్రీహ‌రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా.. హీరో మేఘాంశ్ శ్రీహ‌రి మాట్లాడుతూ ‘‘ఈరోజు నాన్న‌గారి 62వ బ‌ర్త్ డే. ఆయ‌న జ‌యంతిని నిర్వ‌హించాం. ఈ మండ‌పంలోనే చెల్లి అక్ష‌రకు చెందిన స్మార‌కం కూడా ప‌క్క‌నే ఉంటుంది. నాన్న‌గారి జ‌యంతి సంద‌ర్భంగా నేను న‌టించిన ఆస్మాన్ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. నాన్న‌గారికి అంద‌రూ ఆశీర్వ‌దించిన‌ట్లే న‌న్ను…

Read more