సందీప్ కిషన్ యాక్షన్-అడ్వెంచర్, హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘సిగ్మా’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల…
‘బకైతి’ సీజన్ 2 జీ5లో సెప్టెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్
- ప్రధాన పాత్రల్లో రాజేశ్ తైలాంగ్, షీబా చద్దా, తన్యా శర్మ, ఆదిత్య శుక్ల
- ప్రేక్షకులను మరోసారి నవ్వించటానికి సిద్ధమైన కటారియా ఫ్యామిలీ..ఈసారి మరింత ప్రేమ, నవ్వులు, గొడవలు, రోజువారీ జీవితంలోని సరదా గందరగోళంతో సందడి చేయనున్న కటారి కుటుంబం
ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో తిరుగులేని ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జీ5 తాజాగా అందరికీ నచ్చిన ‘బకైతి’ సీజన్ 2తో సందడి చేయనుంది. లేటెస్ట్‌గా ఈ కొత్త సీజన్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్ సెప్టెంబర్ 25 నుంచి జీ5లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. మధ్య తరగతి కుటుంబ జీవితం, వారి రోజువారీ సమస్యలు, సరదా సంఘటనలను సహజంగా చూపించిన ‘బకైతి’ తొలి సీజన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో ప్రేక్షకులకు నవ్వించిన కటారియా కుటుంబం మరోసారి సందడి చేయడానికి సిద్ధమైంది. ఈసారి మరింత నవ్వులు, గొడవలు, ఆప్యాయతతో పాటు ప్రతి ఒక్కరికీ తమ ఇంటి పరిస్థితులను గుర్తు చేసే ఎన్నో సందర్భాలతో సీజన్ 2 అలరించనుంది. పాత ఘజియాబాద్ పరిచయమైన వీధుల నేపథ్యంలో సాగే ఈ సీజన్‌లో కటారియా కుటుంబ సభ్యులంతా మరోసారి ఒక్కచోట చేరతారు. కొత్త సవాళ్లు, మారుతున్న కుటుంబ సంబంధాలు, ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలు, సరదా సంఘటనల మధ్య కుటుంబంగా కలిసి ఉండటంలోని అందమైన గందరగోళాన్ని వారు ఎలా ఎదుర్కొన్నారు అనేదే ఈ సీజన్‌లో ఆసక్తికరంగా చూపించనున్నారు.
డైస్ మీడియా నిర్మాణంలో సమర్ ఇక్బాల్ దర్శకత్వం వహించిన ‘బకైతి’ సీజన్ 2లో రాజేశ్ తైలాంగ్, షీబా చద్దా, తన్యా శర్మ, ఆదిత్య శుక్లా కటారియా కుటుంబంలోని ప్రధాన పాత్రల్లో మరోసారి సందడి చేయనున్నారు. వీరితో పాటు దేవిషి మదన్, రిత్విక్ నంబియార్, అశోక్ చవాన్ కూడా నటిస్తున్నారు. హాస్యం, భావోద్వేగాలు, ప్రతి కుటుంబానికి దగ్గరగా అనిపించే పరిస్థితుల సమ్మేళనంతో తెరకెక్కిన ఈ కొత్త సీజన్.. రోజువారీ మధ్య తరగతి కుటుంబ జీవితంలోని సంతోషాలు, ఇబ్బందులు, చిన్న చిన్న గొడవలు, ఆప్యాయతలతో కూడిన అందమైన గందరగోళాన్ని మరోసారి ప్రేక్షకులకు వినోదాత్మకంగా చూపించనుంది.
తొలి సీజన్‌లో జరిగిన సంఘటనలకు దాదాపు ఏడాది తర్వాత.. కటారియా కుటుంబం జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఈసారి కుటుంబ సభ్యులు రెట్టింపు కావడంతో పాటు.. గొడవలు, సరదా గందరగోళం కూడా రెట్టింపు కానుంది. అనుకోని పరిణామాల కారణంగా అజయ్, అల్కా, అమన్‌లు తిరిగి కటారియా ఇంటికి వస్తారు. దీంతో రెండు కటారియా కుటుంబాలు ఒకే ఇంట్లో కలిసి ఉండాల్సి వస్తుంది. మొదట్లో కొంతకాలం మాత్రమే అనుకుంటారు. అయితే క్రమంగా అభిప్రాయ భేదాలు, పట్టుదల వల్ల వచ్చిన గొడవలు, పాత మనస్పర్థలు, రోజువారీ చిన్న చిన్న తగాదాలతో కూడిన గందరగోళంగా మారుతుంది. సాధారణ కుటుంబాల్లో జరిగే ఇలాంటి సరదా సంఘటనలే ఈ సీజన్‌లో మరింత వినోదాన్ని పంచనున్నాయి.
ఈ నవ్వులు, గందరగోళం వెనుక ఈసారి సమస్యలు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయి. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, సంబంధాల్లో తలెత్తే సమస్యలు, నానాజీ జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గిపోవడం వంటి పరిణామాలు కటారియా కుటుంబాన్ని మరిన్ని సమస్యల్లోకి నెట్టేస్తాయి. మరోవైపు కటారియా ఇల్లు రీడెవలప్‌మెంట్‌కు వెళ్లే పరిస్థితి రావడంతో.. ఇది కేవలం ఓ ఇంటి విషయంలో తలెత్తిన వివాదంగా మిగలదు. ఆ ఇల్లు తమకు, తమ కుటుంబానికి, తమ జ్ఞాపకాలకు ఎంత ముఖ్యమో ప్రతి కుటుంబ సభ్యుడు ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మొత్తం గందరగోళానికి మధ్యలో చిక్కుకునేది సంజయ్ కటారియా. వరుసగా ఎదురయ్యే కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటూనే.. పరిస్థితులు మరింత ముదరకుండా కుటుంబాన్ని ఒక్కతాటిపై ఉంచేందుకు అతను చేసే ప్రయత్నాలు ఈ సీజన్‌లో ఆసక్తికరంగా ఉండనున్నాయి.
హాస్యం, భావోద్వేగాలు, కుటుంబ జీవితంలోని రోజువారీ గందరగోళాన్ని కలగలిపి ‘బకైతి’ సీజన్ 2.. ప్రేమ, ఆశయం, అభద్రత, వ్యక్తిత్వం, గత జ్ఞాపకాలు, కుటుంబ సభ్యులను ఒక్కటిగా నిలబెట్టే సంక్లిష్టమైన బంధాలను చూపించనుంది. ఈ సీజన్2లో ప్రధానంగా అందరూ ఎదుర్కొనే ఓ వ్యక్తిగతమైన ప్రశ్నను లేవనెత్తనున్నారు. ఇల్లు అంటే మన చుట్టూ ఉన్న నాలుగు గోడలేనా? లేక ఆ ఇంట్లో మనతో కలిసి జీవించే మనుషులు, వారితో ముడిపడిన జ్ఞాపకాలే నిజమైన ఇల్లా? అనే ఆలోచనను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
రెండు కటారియా కుటుంబాలు ఇప్పుడు ఒకే ఇంట్లో ఉండటంతో.. తొలి సీజన్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్న గందరగోళం, గొడవలు, కామెడీ సన్నివేశాలు, కుటుంబ ఆప్యాయతను సీజన్ 2 మరింత రెట్టింపు చేయనుంది. డబ్బు సమస్యలు, అన్నదమ్ముల మధ్య బంధాలు, పిల్లల పెంపకం, భార్యాభర్తల బంధం, తరాల మధ్య అభిప్రాయ భేదాలు.. ఇలా ప్రతి ఇంట్లో కనిపించే గందరగోళ పరిస్థితుల్లోనే ‘బకైతి’ సరదాను, హాస్యాన్ని పండించనుంది.
‘బకైతి’ సీజన్ 2లో కటారియా ఇల్లు కీలకమైన అంశంగా కనిపించనుంది. ఆ ఇంటి భవిష్యత్తుపై కుటుంబ సభ్యుల మధ్య చర్చలు మొదలయ్యే కొద్దీ.. అది కేవలం ఓ ఇల్లు కాకుండా తమకు చెందిన భావన, గుర్తింపు, కుటుంబ చరిత్ర, జ్ఞాపకాలకు ప్రతీకగా మారుతుంది. దీంతో ఆ ఇంటి భవిష్యత్తు ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా ఎంతో ముఖ్యమైన విషయంగా మారుతుంది. నవ్వులు, సరదా సన్నివేశాల వెనుక ఆశయం, అభద్రత, గుర్తింపు కోసం తపన, ఆందోళన, ప్రేమతో పాటు కాలానుగుణంగా మారుతూ ఉండే కుటుంబ సంబంధాల కథ కూడా ‘బకైతి’లో కనిపించనుంది.
కటారియా కుటుంబం ఈసారి ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది. వారి మధ్య జరిగే గొడవలు, ఆశలు, అభద్రతలు, ఒకరిపై ఒకరు చూపించే ఆప్యాయత.. ఇలా ప్రతి కుటుంబంలో కనిపించే అందమైన సంక్లిష్టతను ‘బకైతి’ ప్రతిబింబించనుంది. రాజేశ్ తైలాంగ్, షీబా చద్దా, తన్యా శర్మ, ఆదిత్య శుక్లా తమకు మంచి పేరు తెచ్చిన పాత్రల్లో మరోసారి నటించనున్నారు. వీరితో పాటు దేవిషి మదన్ కొత్త పాత్రలో ‘బకైతి’ ప్రపంచంలోకి అడుగుపెట్టి మరింత కొత్తదనాన్ని తీసుకురానున్నారు. రిత్విక్ నంబియార్, అశోక్ చవాన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కటారియా కుటుంబం తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను, అలాగే తమ పూర్వీకుల ఇంటిని కోల్పోయే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు, ఆస్తి మాత్రమేనా? లేక ఆ ఇంటికి విలువను ఇచ్చే మనుషులు, బంధాలు, జ్ఞాపకాలే అసలైన ఇల్లా? అనే ప్రశ్నకు ‘బకైతి’ సీజన్ 2 సమాధానం వెతకనుంది.
బకైతి 2 ట్రైలర్ విడుదల, సీజన్ స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా..దర్శకుడు సమర్ ఇక్బాల్ మాట్లాడుతూ.. ‘బకైతి’ ప్రపంచం నాకు ఎంతో పరిచయంగా అనిపిస్తుంది. ‘ఐ లవ్ యూ’ అని నేరుగా చెప్పుకోలేని కుటుంబం. కానీ మీరు భోజనం చేశారో లేదో చూసుకోవడం, మీరు మాట్లాడుతుండగానే మధ్యలో కలగజేసుకోవడం, అసలు అడగకపోయినా సలహాలు ఇవ్వడం.. ఇలాంటి విషయాలే ఆ కుటుంబంలో ప్రేమను తెలియజేస్తుంటాయి. ఆ గందరగోళం, ఆప్యాయత, ఒకదానికొకటి విరుద్ధంగా అనిపించే భావాలే కటారియా కుటుంబాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. సీజన్ 2 విషయంలో నా ప్రధాన ఆలోచన ఒక్కటే.. ఈ కుటుంబానికి మరింత దగ్గరగా వెళ్లాలి అనిపించింది. తొలి సీజన్‌లో కటారియా కుటుంబాన్ని బయట నుంచి పరిశీలించినట్లుగా చూపించాం. కానీ సీజన్ 2లో వాళ్లతో కలిసి మనం కూడా జీవిస్తున్న అనుభూతి కలిగించాలని అనుకున్నాను. గత సీజన్‌లోని హాస్యం, గందరగోళాన్ని అలాగే కొనసాగిస్తూనే.. ఈసారి పాత్రల అంతరంగాలు, వారి మధ్య సంబంధాలు, చిన్న చిన్న బాధలు, బయటకు చెప్పుకోలేని విషయాలపై మరింత దృష్టి పెట్టాం. ఇలాంటి సహజమైన కథలకు మద్దతు ఇస్తూ, ‘బకైతి’లాంటి సిరీస్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కల్పిస్తున్న జీ5కు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ సిరీస్‌ను రూపొందించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ప్రేక్షకులు మరోసారి కటారియా కుటుంబంతో కలిసి ప్రయాణం చేయడానికి వస్తారని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈసారి మరింత భావోద్వేగం, మరింత హాస్యం..మరింత గందరగోళం ఉంటుంది” అన్నారు.
నటుడు రాజేశ్ తైలాంగ్ మాట్లాడుతూ “కటారియా కుటుంబం, వారి రోజువారీ జీవితంలోని గందరగోళంతో ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ కావడంతో ‘బకైతి’ మా అందరి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. తొలి సీజన్‌కు లభించిన ఆదరణ, ప్రేమను దృష్టిలో పెట్టుకుంటే.. సీజన్ 2 కోసం మళ్లీ రావడం ఎంతో ఆనందంగా ఉంది. కొత్త సీజన్‌లోనూ అదే ఆప్యాయత, హాస్యం, సహజత్వం కొనసాగుతాయి. అయితే ఈసారి కటారియా కుటుంబం మరింత కొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ ఇప్పుడు విడుదల కావడం, సీజన్ ప్రీమియర్‌తో జీ5 హిందీ ద్వారా ప్రేక్షకులు మరోసారి కటారియా కుటుంబాన్ని కలుసుకోబోతుండటం నాకు ఎంతో సంతోషంగా ఉంది” అన్నారు.
నటి షీబా చద్దా మాట్లాడుతూ “‘బకైతి’లో సరదా ఏంటంటే.. అందులోని గందరగోళం, గొడవలు మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల నుంచే వచ్చినట్లు కనిపిస్తాయి. ఇప్పుడు రెండు కటారియా కుటుంబాలు ఒకే ఇంట్లో ఉండటంతో.. సహజంగానే మరింత గందరగోళం, ఎక్కువ గొడవలు, ఇంకా చెప్పాలంటే మరింత ‘బకైతి’ ఉండబోతోంది. అదే సమయంలో ఈ సిరీస్‌లో ఉండే ఆప్యాయత ప్రేక్షకులను ఈ కుటుంబానికి మరింత దగ్గర చేస్తుంది. వాళ్లు చేసే పిచ్చి పనులు, గొడవలు ఎన్ని ఉన్నా.. చివరికి ప్రేక్షకులు ఈ కుటుంబం బాగుండాలని కోరుకునేలా చేస్తుంది. ఈ ప్రపంచంలోకి..ఈ పాత్రల్లోకి మళ్లీ రావడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఇప్పుడు ట్రైలర్ విడుదల కావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈసారి కటారియా కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుందో ప్రేక్షకులు చూసేందుకు నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సెప్టెంబర్ 25న జీ5లో మాతో కలిసి ఈ ప్రయాణంలో భాగం కావాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను” అన్నారు.
కటారియా కుటుంబానికి మరోసారి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండండి! ఈసారి కుటుంబం మరింత పెద్ద కుటుంబంగా.. సమస్యలు మరింత గందరగోళంగా మారనున్నాయి.. ‘బకైతి’ కూడా రెట్టింపు కానుంది. 2026 సెప్టెంబర్ 25 నుంచి కేవలం జీ5లో మాత్రమే ‘బకైతి’ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది.
Hindi ZEE5 Original Bakati 2 Trailer: https://youtu.be/_hK_2sO5yYI

