Skip to content

‘పిక్ నిక్ ’ ఫస్ట్ లుక్ రిలీజ్

‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’తో భారీ గ్లోబల్ సక్సెస్‌ను అందుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ భావన స్టూడియోస్ తమ కొత్త సినిమాను ప్రకటించింది. ‘పిక్ నిక్ ’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సందీప్ ప్రదీప్, ఇంద్రజిత్ సుకుమారన్, దిలీష్ పోతన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా 2027 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

‘ప్రేమలు’, ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ విజయాల తర్వాత భవానా స్టూడియోస్ నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సౌత్ ఇండియాలో మంచి బజ్ ఏర్పడింది.

ఈ సినిమాతో రచయిత కిరణ్ జోసీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సెన్సేషనల్ హిట్స్ ‘ప్రేమలు’, ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ చిత్రాలకు కో-రైటర్‌గా పనిచేసిన కిరణ్ జోసీ.. ఆసక్తికరమైన, మన సంస్కృతికి దగ్గరగా ఉండే ఎంటర్‌టైనింగ్ కథలను అందించడంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కేరళతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆయన గత రచనలకు మంచి ఆదరణ లభించడంతో.. దర్శకుడిగా ఆయన తొలి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో ప్రతిభావంతులైన నటీనటుల బృందం కనిపించనుంది. సందీప్ ప్రదీప్, దిలీష్ పోతన్, ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు సుజినా శ్రీధరన్, అక్షత అజిత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా హోల్‌సమ్ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా ‘పిక్నిక్’ రూపొందుతోంది. పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ 2027 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్ చేశారు.

భవానా స్టూడియోస్ సినిమాలకు సౌత్ ఇండియా వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని.. ‘పిక్నిక్’ను మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు భారీ థియేట్రికల్ రిలీజ్ అందించేందుకు ప్రముఖ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ సంస్థ షోయింగ్ బిజినెస్ భాగస్వామిగా చేరింది. గతంలో ‘ప్రేమలు’ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిపిన సంస్థ.. ‘పిక్నిక్’ తెలుగు థియేట్రికల్ రిలీజ్‌ను గ్రాండ్ గా చేయనుంది.

సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.

నటీనటులు: సందీప్ ప్రదీప్, దిలీష్ పోతన్, ఇంద్రజిత్ సుకుమారన్, సుజినా శ్రీధరన్, అక్షత అజిత్

రచన, దర్శకత్వం: కిరణ్ జోసీ
సంగీతం: గోవింద్ వసంత
నిర్మాతలు: ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్
బ్యానర్: భవానా స్టూడియోస్
పీఆర్వో: వంశీ శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.