Skip to content

‘సోనీ విళా’ను ఆవిష్క‌రించిన సోనీ పిక్చ‌ర్స్ నెట్‌వ‌ర్క్స్ ఇండియా

తమిళ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను ప్రదర్శిస్తూ ‘సోనీ విళా’ ఆవిష్క‌ర‌ణ‌. ప్రీమియం స్థాయిలో రూపొందిన భావోద్వేగభరితమైన తమిళ కథలను వివిధ స్క్రీన్స్‌, కుటుంబాలు, భౌగోళిక ప్రాంతాలకు చేరువ చేసేలా రూపొందిన కొత్త బ్రాండ్. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) తాజాగా తన కొత్త తమిళ జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌కు ‘సోనీ విళా’ అనే పేరు, బ్రాండ్ ఐడెంటిటీని ఆవిష్కరించింది. అక్టోబర్ 2026లో ఈ ఛానల్ లాంచ్ కానుంది. తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెడుతున్న SPNI.. తమిళ సంస్కృతి, భావోద్వేగాలు, భాష, స్థానిక జీవన విధానాలకు బలమైన అనుబంధంతో కూడిన ప్రీమియం కంటెంట్‌ను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో.. అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలు, క్రియేటివ్ ఎగ్జిక్యూషన్‌,…

Read more

దేవ కట్టా సమర్పణలో రూపొందుతోన్న ‘జో జో’

వైవిధ్యంగా, సీరియస్‌గా, ఆలోచింపజేసే కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు దేవ కట్టా ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జోనర్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన సమర్పణలో రూపొందనున్న రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం ‘జో జో’. జొన్నగిరిలోని అల్ట్రా రూరల్ డైమండ్ ఫీల్డ్స్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ‘మయసభ’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ జయ్ కుమార్ ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ, కొత్త జీవితంపై ఆశ‌లు, జీవితంలో ఎదగాలనే తపన.. మెరుగైన జీవితం కోసం మనుషులు ఎంత దూరమైన వెళ్లే తీరుని వ్యంగ్య హాస్యంతో ‘జో జో’ చిత్రంలో ఆవిష్క‌రించ‌బోతున్నారు. ఎండిపోయిన జొన్నగిరి డైమండ్ ఫీల్డ్స్‌లో ఇద్దరు పేద యువకులు, ఒక ధైర్యమైన యువతి…

Read more

‘లెనిన్’.. ఒక వారంలోనే 200 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు క్రాస్ చేసిన సినిమా

బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు తెలుగు ZEE5లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేయటం విశేషం. ఈ ఘనత సినిమాకు ఓ చారిత్రాత్మక స్ట్రీమింగ్ మైల్‌స్టోన్‌గా నిలిచింది. థియేట్రిక‌ల్‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన ‘లెనిన్’పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి, సినిమాను చూసేందుకు కొనసాగుతున్న ఉత్సాహానికి ఇదొక ఉదార‌ణ‌. మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత జూలై 10న థియేటర్లలో విడుదలైన ‘లెనిన్’ సినిమా ఆయన కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌ను సాధించింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ.100 కోట్ల వ‌సూళ్ల‌తో లాభాల బాట ప‌ట్టిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన మంచి స్పందన కొన‌సాగుతోంది. అదే ఆదరణతో ‘లెనిన్’ మంచి…

Read more

రెండు రోజుల్లోనే 100 మిలియ‌న్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ‘లెనిన్‌’ సెన్సేష‌న్

అఖిల్ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ముర‌ళి కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. థియేట‌ర్స్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో రూ.100 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 7 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. థియేట‌ర్స్‌లో అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కుల, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న ఈ సినిమా జీ5తో ప్ర‌తి ఇంటిలో ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైంది. లెనిన్ సినిమా థియేట‌ర్స్‌లోనే కాదు.. జీ5లో స్ట్రీమింగ్‌లోనూ స‌రికొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తుండ‌టం విశేషం. రెండు రోజుల్లోనే లెనిన్ సినిమా 100 మిలియ‌న్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్…

Read more

‘భారత్ భాగ్య విధాత’ ఆగష్టు 14న హిందీ జీ 5లో ప్రత్యేక ప్రసారం

* కంగనా రనౌత్, గిరిజా ఓక్, స్మిత తాంబే నటించిన 'భారత్ భాగ్య విధాత' త్యాగం, వీరత్వంకు ప్రతీకగా నిలిచే చిత్రం ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ధైర్యం, స్థైర్యం, నిస్వార్థ సేవలోని స్ఫూర్తిని చాటిచెప్పేందుకు ఆగస్టు 14న 'భారత్ భాగ్య విధాత' ప్రత్యేక డిజిటల్ ప్రీమియర్‌తో హిందీ జీ 5 ప్రేక్షకులను ఆహ్వానిస్తోంది. భారతదేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు సాహసోపేతమైన, స్ఫూర్తిదాయకమైన, సాంస్కృతికంగా ప్రతిధ్వనించే కథలను అందించాలనే తన నిబద్ధతను కొనసాగిస్తూ ఈ స్వదేశీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ దేశాన్ని నిర్వచించే విలువలను ప్రతిబింబించే అసాధారణ ధైర్యసాహసాలు కలిగిన అజ్ఞాత వీరులను వెలుగులోకి తీసుకు వస్తుంది. మనోజ్ తపడియా రచన, దర్శకత్వంలో పెన్ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్, పరమహంస్ క్రియేషన్స్, యూనోయా ఫిల్మ్స్ LLP,…

Read more

పాతబస్తీ మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో బంగారు బోనం ఎత్తిన సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల

హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనం ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేదమంత్రాల నడుమ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందిన అనంతరం ఆలయ అధికారులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గాజుల అంజయ్య నిహారికకు ఆలయ చరిత్రతో పాటు ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాల విశిష్టత, సంప్రదాయాలను వివరించారు. అనంతరం నిహారిక మాట్లాడుతూ, ప్రధాన బోనాల రోజు షూటింగ్ ఉండటంతో ఆలయానికి రాలేకపోయానని, అందుకే అమ్మవారి దర్శనానికి వచ్చినట్లు తెలిపారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టి…

Read more

‘వంద దేవుళ్లు’ ఆగస్ట్ 7 నుంచి జీ5లో స్ట్రీమింగ్

నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా త‌ల్లీ కొడుక‌ల మ‌ధ్య అనుబంధాన్ని హృద‌యానికి హ‌త్తుకునేలా తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు శ‌శి డిఫరెంట్ మూవీస్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరో విజ‌య్ ఆంటోని ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ మూవీ ఎమోష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్యామిలీ డ్రామా ‘వంద దేవుళ్లు’. త‌మిళంలో ‘నూరు సామి’గా రిలీజైంది. ‘బిచ్చ‌గాడు’(పిచ్చైకార‌ణ్‌) సినిమా విడుద‌లైన 10 సంవ‌త్స‌రాల‌వుతుంది. ఆ సినిమా త‌ర్వాత విజ‌య్ ఆంటోని, డైరెక్ట‌ర్ శ‌శి కాంబోలో వ‌చ్చిన సినిమా ఇది. భావోద్వేగ కుటుంబ క‌థా చిత్రంగా ఇది తెర‌కెక్కింది. విజ‌య్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యాన‌ర్‌పై విజయ్ ఆంటోనీ, ఫాతిమా విజయ్ ఆంటోని ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం Zee5లో తెలుగు, త‌మిళ‌, కన్నడ,…

Read more

జీ5లో ఆగ‌స్ట్ 7 నుంచి ‘లెనిన్‌’ స్ట్రీమింగ్

అఖిల్ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ముర‌ళి కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. జూలైలో థియేటర్స్‌లో విడుద‌లైన ఈ చిత్రం అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కుల, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్‌హిట్ టాక్‌తో తొలి ఆట నుంచే వ‌సూళ్ల‌తో త‌న‌దైన స‌త్తాను చాట‌డ‌మే కాకుండా రీసెంట్‌గా రూ.100 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్‌ను అల‌రించిన ఈ చిత్రం ఇప్పుడు ఇంటింట ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి సిద్ధ‌మైంది. డిఫ‌రెంట్ కంటెంట్‌తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో ఈ చిత్రం ఆగ‌స్ట్ 7 నుంచి…

Read more

7 భాష‌ల్లో మ‌ల్టీ లాంగ్వేజ్ కంటెంట్ లైన‌ప్ అనౌన్స్ చేసిన జీ5

- ఎన్‌బీకే111, వెంకీ అనీల్5, వృష‌క‌ర్మ స‌హా ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో తెలుగు ఆడియెన్స్‌కు అల‌రించ‌నున్న జీ5 అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు డిఫ‌రెంట్ కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తోన్న స్వ‌దేశీ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ జీ5 ..ట్రెండ్‌ను ఫాలో కావ‌టం కాదు..ట్రెండ్ క్రియేట్ చేయ‌టంలో మాకు మేమే సాటి దూసుకెళ్తోంది. తాజాగా జీ5 మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. అత్యంత ప్రతిష్టాత్మక మల్టీలాంగ్వేజ్ కంటెంట్ లైనప్‌ను అనౌన్స్ చేసి అంద‌రిలో తెలియ‌ని ఓ స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది. కొత్త తరం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ లైన‌ప్‌లో కొత్త కథలు, క్రియేట‌ర్స్‌, డిఫ‌రెంట్ ఫార్మేట్స్ ఉండ‌టం విశేషం. ఇంట్రెస్టింగ్ విష‌య‌మేమంటే.. తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషలను కవర్…

Read more

మెగాస్టార్ చిరంజీవిగారు ఆబ్లెక్షన్ మై లార్డ్ ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది – శ్రీకాంత్

వినూత్న‌మైన కంటెంట్‌తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ అంద‌రి హృద‌యాల్లో త‌న‌దైన స్ధానాన్ని ద‌క్కించుకున్న మోస్ట్ పాపుల‌ర్ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 నుంచి మ‌రో ఒరిజిన‌ల్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అదే ‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’. శ్రీకాంత్, అన‌న్య శ‌ర్మ‌, ముఖేష్ రుషి, స్నేహాల్‌, స‌మీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. ‘నోటరీ పరశురాం’ ట్యాగ్ లైన్‌. సంతోష్ అయ్య‌ప్ప‌న్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ సిరీస్‌ను రూపొందించారు. 7 ఎపిసోడ్స్‌తో ఎమోష‌న‌ల్ కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ ఒరిజిన‌ల్ జూలై 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ రోజు ఈ సిరీస్ ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటీనటులతో పాటు హీరో…

Read more