“మన శంకరవరప్రసాద్ గారు” మీ అందరి అంచనాలని అందుకుంటుంది: డైరెక్టర్ అనిల్ రావిపూడి
-మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ మూవీ టైటిల్ "మన శంకరవరప్రసాద్ గారు", మాస్ హిస్టీరియా గ్లింప్స్ లాంచ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. #Mega157, #ChiruAnil వర్కింగ్ టైటిల్స్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన గర్వంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి "మన శంకరవరప్రసాద్ గారు" అనే టైటిల్ పెట్టారు. "పండగకి…