‘మన శంకరవరప్రసాద్ గారు’ వినాయక చవితి ట్రెడిషనల్ పోస్టర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవెయిటింగ్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకరవరప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ ఆధ్వర్యంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అర్చన సగర్వంగా సమర్పిస్తున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ గ్లింప్స్‌తో సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. పండగకి వస్తున్నారు అనే ఆకట్టుకునే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం వస్తుంది. ఈ రోజు, వినాయక చవితి శుభ సందర్భంగా, మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. చిరంజీవి ఒక గొప్ప సాంప్రదాయ అవతార్ లో పట్టు చొక్కా, పట్టు పంచె, కండువా ధరించి, స్టైలిష్ షేడ్స్ తో ఓ షిప్ డెక్క్ మీద గ్రాండ్…