అక్టోబర్ 16 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానున్న ‘సుగ్రీవ’
ఈ వేసవిలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సస్పెన్స్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా 'సుగ్రీవ' ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. బాలు చరణ్, కాజల్ తివారి జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఎస్.జి.ఎస్.వి మూవీస్ బ్యానర్పై నిర్మాత ఎం. పవన్ కుమార్ ఉన్నత నిర్మాణ విలువల తో నిర్మించగా, నార్తు చిరంజీవి దర్శకత్వం వహించారు. 2026 ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, కుటుంబ భావోద్వేగాలతో పాటు ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ అంశాలను చక్కగా మేళవించి విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యేందుకు, అక్టోబర్ 16 శుక్రవారం నుంచి ప్రముఖ ప్రాంతీయ ఓటీటీ ప్లాట్ఫామ్ 'ఆహా'లో…
