యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్, యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నటిస్తున్న తాజా చిత్రం…
అక్టోబర్ 16 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానున్న ‘సుగ్రీవ’

ఈ వేసవిలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సస్పెన్స్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘సుగ్రీవ’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. బాలు చరణ్, కాజల్ తివారి జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఎస్.జి.ఎస్.వి మూవీస్ బ్యానర్పై నిర్మాత ఎం. పవన్ కుమార్ ఉన్నత నిర్మాణ విలువల తో నిర్మించగా, నార్తు చిరంజీవి దర్శకత్వం వహించారు.
2026 ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, కుటుంబ భావోద్వేగాలతో పాటు ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ అంశాలను చక్కగా మేళవించి విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యేందుకు, అక్టోబర్ 16 శుక్రవారం నుంచి ప్రముఖ ప్రాంతీయ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’లో ‘సుగ్రీవ’ ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత ఎం. పవన్ కుమార్ మాట్లాడుతూ.. “మా సినిమా థియేట్రికల్ రన్లో సినీ ప్రేమికులు, విమర్శకుల నుంచి ఎంతో ప్రేమ, ప్రశంసలు అందుకుంది. అయితే వేసవిలో ఉన్న బిజీ షెడ్యూల్స్ వల్ల చాలామంది ఫ్యామిలీ ఆడియెన్స్, ప్రేక్షకులు థియేటర్లలో ‘సుగ్రీవ’ చిత్రాన్ని చూడలేకపోయారని మాకు తెలిసింది. ఇప్పుడు మా సినిమా అక్టోబర్ 16 నుంచి నేరుగా ‘ఆహా’ ఓటీటీలోకి వస్తోంది. కాబట్టి థియేటర్లలో మిస్సయిన ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే కూర్చుని ఈ భావోద్వేగభరితమైన, ఉత్కంఠ కలిగించే కథను వీక్షించాలని కోరుతున్నాం. ఈ చిత్రం మీకు ఖచ్చితంగా ఒక మంచి అనుభూతిని అందిస్తుందని నమ్ముతున్నాం” అని తెలిపారు.

