ఎన్‌టీఆర్ వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రక్షణ కల్పించిన ఢిల్లీ హైకోర్టు
ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ కల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ మాధ్యమాల్లో తన పేరు, ఫోటోలు, గుర్తింపును అనుమతి లేకుండా వాణిజ్య పరమైన ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ వేశారు. ఈ విషయాన్ని పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు ఆయన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పిస్తూ ఆదేశాలను జారీ చేసింది. ఆదేశాల మేరకు ఎన్‌టీఆర్ గారి పేరు గానీ, “ఎన్‌టీఆర్”, “జూనియర్ ఎన్‌టీఆర్”, “తారక్” లాంటి పేర్లు గానీ, “యంగ్ టైగర్”, “మ్యాన్ ఆఫ్ మాసెస్” వంటి పేర్లు గానీ, అలాగే ఆయన ఫోటోలు, ఇమేజ్‌ను అనుమతి లేకుండా వాణిజ్య పరంగా వాడితే చట్ట…
