‘పురుష:’ చిత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది – హీరో పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని మే 22న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో పవన్ కళ్యాణ్ మీడియాతో పంచుకున్న విశేషాలివే.. మీ నేపథ్యం గురించి చెప్పండి? మాది పల్నాడులోని మాచర్ల దగ్గర్లోని కారంపూడి. మాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి…
