ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న ‘మయూఖ’
రూ.3 కోట్లకు పైగా థియేట్రికల్, ఓటీటీ కలెక్షన్లు.. పెట్టిన బడ్జెట్‌పై మూడు రెట్లకు పైగా వసూళ్లు సాధించిన చిన్న సినిమా. హైదరాబాద్: చిన్న సినిమాలకు థియేటర్లలో మూడు రోజులు ప్రదర్శన కొనసాగడమే కష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో, తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’ అరుదైన విజయాన్ని అందుకుంది. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఐనాక్స్ ఓడియన్ థియేటర్‌లో 50 రోజుల ప్రదర్శనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. శ్రీ తేజ్ ఎస్‌కే దర్శకత్వంలో, శశిధర్ నల్ల నిర్మాణంలో ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘మయూఖ’ థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ మంచి ఆదరణను సొంతం చేసుకుంది. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది…
