‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు
వైవిధ్యమైన సినిమాలతో హీరోగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అర్జున్ అంబటి. అతను హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'పరమపద సోపానం'. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శిష్యుడు నాగ శివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహించారు. 'గణపర్తి శ్వేత' సమర్పణలో 'స్వయంభూ క్రియేషన్స్' బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా... పులగం సుప్రియ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథా నాయికగా నటించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఒక గ్రిప్పింగ్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ గా…
