హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన కథాంశంతో కొత్త చిత్రం ప్రారంభం
యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రెస్టేజీయస్ ప్రాజెక్ట్ ప్రారంభం లవ్ డ్రామాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. అందులోనూ ఎంటర్టైన్మెంట్ లవ్ డ్రామా జానర్స్ కు ప్రత్యేక ఆదరణ దక్కుతుంది. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టు హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శనివారం గ్రాండ్ గా నూతన చిత్రం ప్రారంభమైంది. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న మొదటి చిత్రం ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు సన్నిహితులు హాజరై విజయాశీస్సులు అందించారు. శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా తవిటిరాజు తలచింతల వ్యవహరిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం…
