విశ్వక్‌సేన్ మూవీ గ్రాండ్ లాంచ్
ఎన్టీఆర్ దేవరతో సెన్సేషనల్ క్రియేట్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ మరో భారీ సినిమాను రూపొందించటానికి సిద్ధమైంది. మాస్ కా దాస్‌గా అందరూ పిలుచుకునే విశ్వక్ సేన్ హీరోగా నిర్మాత సుధాకర్ మిక్కిలినేని ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి యువ సుధ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.3 అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించటంతో పాటు సమర్పకుడిగానూ వ్యవరిస్తుండటంతో ప్రాజెక్ట్‌పై మరింత హైప్ పెరిగింది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ కొట్టగా, నిర్మాత…
