జీ5లో ‘ఆక్టోపస్’.. రహస్యాలు, మిస్టరీతో సాగే ఉత్కంఠభరితమైన కథ!..
జయచంద్ర హష్మీ దర్శకత్వంలో రూపొందిన 7 ఎపిసోడ్స్ తమిళ జీ5 ఒరిజినల్ సిరీస్.. కీలక పాత్రల్లో అశ్విన్, అర్చన, వినోద్ కిషన్, సిద్ధు కుమరేశన్, కలైవాణి భాస్కర్ తమిళ జీ5 ఒరిజినల్ సిరీస్‌లకు సంబంధించిన విభాగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటూ.. విభిన్న జోనర్స్లో ఆసక్తికరమైన ప్రాంతీయ కథలను ప్రేక్షకులకు అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన కథనానికి సంబంధించిన శైలిని మరో స్థాయికి తీసుకెళ్తూ.. ‘ఆక్టోపస్’ అనే ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్‌ను ప్రీమియర్‌కు సిద్ధం చేసింది. ఈ సిరీస్‌లో శక్తివంతమైన మహిళా ప్రధాన కథతో పాటు.. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ఇప్పటివరకు ఉన్న సంప్రదాయ కథనాలకు భిన్నంగా కొత్త తరహా అనుభూతిని అందించనుంది. జయచంద్ర హష్మీ దర్శకత్వంలో రూపొందిన ఈ…
