‘రాంబో’ పవర్‌ఫుల్ గ్లింప్స్ రిలీజ్
యంగ్ ట్యాలెంటెడ్ శ్రీతేజ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రాంబో’. రత్నాకరం అనిల్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, హిడింబ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన నిర్మాత శ్రీధర్ గంగపట్నం, ఎస్‌వీకే సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన ‘రాంబో’ గ్లింప్స్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. “ఒక మృగం మనిషిగా పుడితే వాడే రాంబో” అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమైన గ్లింప్స్ వైల్డ్ యాక్షన్ తో ఆకట్టుకుంది. శ్రీతేజ్ ఇంటెన్స్, అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్‌తో పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించిన వైల్డ్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ పాత్రను మరింత బలంగా నిలబెట్టాయి. దర్శకుడు రత్నాకరం అనిల్ రాజు…
