పెద్దిలో రామ్ చరణ్ గారి నట విశ్వరూపం చూస్తారు: డీవోపీ రత్నవేలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డీవోపీ రత్నవేలు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఈ కథ చెప్పినప్పుడు మీ ఆలోచనలు, విజువలైజేషన్ ఎలా ఉండింది? -బుచ్చిబాబు గారు ఈ కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. ఇది…
