‘అనకాపల్లి’ సినిమాని మంచి సందేశంతో రూపొందించాం – నిర్మాతలు త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు
భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఆగస్ట్ 7న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో నిర్మాతలు త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు చిత్రానికి సంబంధించిన విషయాల్ని పంచుకున్నారు. వారు చేసిన సంగతులివే.. కాండ్రేగుల నాయుడుతో మీకున్న బంధం గురించి…
