‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి : ఫహాద్ ఫాజిల్
ఫహాద్ ఫాజిల్ హీరోగా ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్ల మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ ఏలేటి దర్శకుడు. అక్టోబర్ 2న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో శనివారం ఫహాద్ ఫాజిల్ మీడియాతో ముచ్చటించారు. సినిమా గురించి ఆయన చెప్పిన విశేషాలివే.. * ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా చేయటానికి కారణమేంటి? - కార్తికేయ నాకు ఫోన్ చేసిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కథ గురించి చెప్పారు. శశాంక్ వచ్చి కథ చెప్పారు. నా జీవితంలో అసలు ఇలాంటి ఓ కథను వినలేదు. విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. ఈ సినిమాని…
