Skip to content

అవెంజర్స్ మరోసారి థియేటర్లలోకి – ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ చూడాల్సిన 5 కారణాలు

మార్వెల్ అభిమానులకు మరోసారి పండగ రాబోతోంది. 2019లో విడుదలైన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు, అర్ధరాత్రి ప్రదర్శనలు, అభిమానులు తమకు ఇష్టమైన సూపర్‌హీరోల వేషధారణలో థియేటర్లకు రావడం వంటి ఎన్నో ప్రత్యేక అనుభవాలను ఈ సినిమా అందించింది. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ మరోసారి ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ పేరుతో థియేటర్లలోకి వస్తోంది. అలాగే త్వరలో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ రాబోతున్న నేపథ్యంలో ఎండ్‌గేమ్‌ను మరోసారి పెద్ద తెరపై చూడటానికి మరింత ఆసక్తి నెలకొంది. 1. మార్వెల్‌లో అతిపెద్ద ఈవెంట్‌ను మరోసారి ఆస్వాదించవచ్చు 22 సినిమాల్లో కొనసాగిన కథలు, పాత్రలను ఒకే సినిమాలో కలిపిన ఘనత ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’కు ఉంది. ఈ సినిమాను మరోసారి పెద్ద తెరపై…

Read more

సెప్టెంబర్ 25న ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’తో మరోసారి గ్రాండ్ రిలీజ్

మార్వెల్ అభిమానులకు మరోసారి బిగ్ స్క్రీన్‌పై అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు మార్వెల్ స్టూడియోస్ సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన *‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’*కు ప్రత్యేకమైన ఎంకోర్ ప్రదర్శనగా ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ సెప్టెంబర్ 25, 2026న భారతదేశంలోని థియేటర్లలో విడుదల కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఐమాక్స్ ®తో పాటు మార్వల్ Studios Presents ఇన్ఫినిటీ విజన్ సర్టిఫైడ్ ప్రీమియం లార్జ్ ఫార్మాట్ (PLF) స్క్రీన్స్‌లోనూ ఈ స్పెషల్ ప్రెజెంటేషన్ అందుబాటులో ఉంటుంది. పెద్ద స్క్రీన్స్, మరింత ప్రకాశవంతమైన విజువల్స్, అత్యుత్తమ సౌండ్‌తో ప్రేక్షకులకు మరింత గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించనుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోని ఇన్ఫినిటీ సాగాకు మహత్తర ముగింపుగా…

Read more