‘మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ ఈ సినిమా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. ఈ ఏడాది హిందీ చిత్రాల్లో అత్యంత భారీ విదేశీ విడుదలల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా, 59 దేశాల్లో 804 స్క్రీన్‌లపై విడుదలైంది. హిందీ రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో కూడా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడం విశేషం. సినిమాకు వస్తున్న అద్భుతమైన…
