పెళ్లి పీటలెక్కబోతున్న హీరో శివ కందుకూరి
తెలుగు సినిమాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శివ కందుకూరి త్వరలోనే తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడైన శివ కందుకూరి, ఈ డిసెంబర్‌లో శిశిర సింహాను వివాహం చేసుకోబోతున్నారు. ‘చూసీ చూడంగానే’, ‘గమనం’, ‘మను చరిత్ర’, ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ వంటి సినిమాల్లో తన నటనతో శివ కందుకూరి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్ శిశిర సింహా త్వరలోనే కందుకూరి కుటుంబంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ పెళ్లి వేడుక రెండు కుటుంబాలకు ఎంతో ప్రత్యేకమైన సందర్భంగా నిలవనుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఆత్మీయుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. శివ…
