AVAA జర్నీకి శ్రీకారం చుట్టిన విష్ణు మంచు
సినిమా రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో AVAA ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో AVAA ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ పోటీకి టాలీవుడ్ హీరో, నిర్మాత విష్ణు మంచు నాయకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు “రోడ్ టు AVAA ఎంటర్‌టైన్‌మెంట్” అనే పేరుతో ప్రోమో విడుదల చేయగా.. దీనికి భారీ స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా 11,000కు పైగా ఇంక్విరీస్ రాగా, 3,000కు మించిన షార్ట్ ఫిల్మ్ ఎంట్రీలు వచ్చాయి. వచ్చిన అన్ని అప్లికేషన్స్ నుంచి టాప్ 100 షార్ట్ ఫిలిమ్స్ ఎంపిక చేశారు. ఈ చిత్రాలను ఫిబ్రవరి 19 నుంచి AVAA ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ షోకు టాలీవుడ్ నటుడు శివ బాలాజీ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు…
