Skip to content
జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ Telugu News

జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ భారతీయ అభిమానులకు ఒక రోజు ముందుగానే థియేటర్లలో సందడి చేయనుంది. మొదట ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగా, ఈ చిత్రం జూలై 30, 2026న భారతదేశంలో విడుదల కానుంది. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అలాగే, భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జూన్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి. విడుదలైన ట్రైలర్ ఇప్పటికే చరిత్ర సృష్టిస్తూ 1 బిలియన్ వ్యూస్‌ను దాటిన తొలి సినిమా ట్రైలర్‌గా రికార్డు నమోదు చేయడం విశేషం. దాదాపు ఐదేళ్ల తర్వాత టామ్ హాలండ్ మరోసారి స్పైడర్-మ్యాన్ పాత్రలో ప్రేక్షకులను…

Read more
‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ లాంచ్ Telugu News

‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ లాంచ్

ప్రపంచవ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ పొందిన స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో సరికొత్త చిత్రం ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ విడుదలైంది. మొట్టమొదటి గ్లోబల్ ఫ్యాన్-డ్రివెన్ ట్రైలర్ టీజ్ తర్వాత, న్యూయార్క్ నగరంలో ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుండి టామ్ హాలండ్ పూర్తి ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఇదొక మరపురాని క్షణంగా నిలిచిపోయింది. ‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ సాధించిన రికార్డ్-బ్రేకింగ్ గ్లోబల్ సక్సెస్ తర్వాత, పీటర్ పార్కర్, స్పైడర్ మ్యాన్‌ల జీవితాల్లో ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. 'నో వే హోమ్' సంఘటనలు జరిగి నాలుగు సంవత్సరాలు గడిచాయి. పీటర్ ఇప్పుడు తనను ప్రేమించేవారి జీవితాలు, జ్ఞాపకాల నుండి తన అస్తిత్వాన్ని…

Read more