‘ది ట్రైటర్స్ తెలుగు’ సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి
అనుమానాల వలయాలు, మారుతున్న పొత్తులు, అంతులేని అనుమానాలను దాటుకుని.. మోసంతో కూడిన ఈ గేమ్‌లో పైచేయి సాధించిన శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42,77,000 ప్రైజ్ మనీ సొంతం హైదరాబాద్, నవంబర్ 6, 2026: ఎలాంటి అబద్ధాన్నైనా ఇట్టే పసిగట్టగలమనే నమ్మకంతో 20 మంది కంటెస్టెంట్స్ లలితా మహల్‌లోకి అడుగుపెట్టారు. వారాల పాటు సాగిన మర్డర్స్, బ్లాక్‌మెయిల్, తప్పుడు అంచనాలు, ఉత్కంఠభరితమైన ‘రింగ్ ఆఫ్ డౌట్’ రౌండ్ల తర్వాత ప్రైమ్ వీడియో ‘ది ట్రైటర్స్ తెలుగు’ తొలి సీజన్ అనూహ్యమైన ముగింపునకు చేరుకుంది. ఇన్నోసెంట్స్‌గా ప్యాలెస్‌లోకి అడుగుపెట్టిన ఇద్దరు ప్లేయర్స్.. చివరికి గేమ్‌లోనే అతిపెద్ద మోసాన్ని విజయవంతంగా అమలు చేశారు. చివరి దశలో తమ తోటి కంటెస్టెంట్స్‌ను మించిపోయిన శ్రావ్య వర్మ, స్వీకర్…
