Skip to content

“ప్రేమనే ఊరిలో” చిత్రం నుండి ‘ఏరై పారే హృదయం’ పాటకు అనూహ్య స్పందన

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏరై పారే హృదయం’ అంటూ సాగే అందమైన పాటకు సమీరా భరద్వాజ్ తన స్వరాన్ని జోడించగా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ డా. సీహెచ్ ప్రీతిరెడ్డి ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నటి, గాయకి సమీరా భరద్వాజ్ గారు మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. నేను ప్రేమనే ఊరిలో సినిమాలో…

Read more

ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం చాలా అరుదుగా మాత్రమే చూస్తాం. C సెంటర్ల నుంచి పెద్ద పెద్ద సెంటర్ల వరకు అన్ని థియేటర్లలో షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ఒకప్పుడు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో విజయశాంతి గారు నటించిన ఓసే రాములమ్మ సినిమాకు జనాలు బండ్లు కట్టుకుని వచ్చి, రాత్రిళ్లు కూడా థియేటర్ల దగ్గర కాపలాలు కాసి సినిమా చూసిన రోజులను నేను చూశాను. అప్పుడు థియేటర్ల దగ్గర కనిపించిన ఆ జనసందోహం, ఆ ఉత్సాహం మళ్లీ ఇప్పుడు ఇరుముడి సినిమాకు కనిపిస్తోంది. ఫ్యామిలీస్‌తో కలిసి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తున్నారు. ఒక్క షో కూడా…

Read more
ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ దృష్టికి చిన్న నిర్మాతల సమస్యలు: నట్టి కుమార్ Telugu News

ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ దృష్టికి చిన్న నిర్మాతల సమస్యలు: నట్టి కుమార్

సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న చిన్న నిర్మాతల సమస్యలను ఇప్పటికైనా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సబ్ కమిటీ పరిష్కరించాలని నట్టి కుమార్ విజ్ఞప్తి చేశారు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్ లో నట్టి కుమార్ అధ్యక్షతన జరిగిన చిన్న నిర్మాతల మీటింగ్ లో చిన్న సినిమాలకు ఎదురవుతున్న పలు సమస్యల గురించి చర్చించి, వాటి పరిష్కారానికి ఈ నెల 15న జరుగనున్న సబ్ కమిటీ దృష్టికి తీసుకుపోవాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ మేరకు సమస్యలకు సంబందించిన వినతి పత్రాన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ, సబ్ కమిటీ ప్రొడ్యూసర్స్ మెంబర్ టి.ప్రసన్నకుమార్ కు ఇదే వేదికపై నట్టి కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ,…

Read more
ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సమస్యలకు ఇద్దరి మధ్య కోల్డ్ వారే కారణం: నట్టి కుమార్ Telugu News

ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సమస్యలకు ఇద్దరి మధ్య కోల్డ్ వారే కారణం: నట్టి కుమార్

ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్...ఇలా ఎవరి సమస్యలు వారికి ఉన్నాయని, వాటిని కూర్చుని చర్చించుకుని ఎవరికీ ఇబ్బందులు తలెత్తని రీతిలో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీనియర్ ప్రొడ్యూసర్స్ నట్టి కుమార్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, "నేను నిర్మాతను, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా కూడా సుదీర్ఘ అనుభవంతో చెబుతున్నాను. ఎగ్జిబిటర్స్ అయినా నిర్మాతలు అయినా కేవలం తమ సమస్యలు మాత్రమే హైలైట్ చేసుకోవడం, అవి మాత్రమే పరిష్కారం కావాలనుకోవడం కరెక్ట్ కాదు. సమస్యను ఎప్పుడైనా రెండు వైపులా చూడాలి. ఇప్పుడు అలా చూడకుండా తమ సమస్య మాత్రమే పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు. నిన్న ఎగ్జిబిటర్స్ పెట్టిన…

Read more
హీరో సిద్దు జొన్నలగడ్డకు సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్ Telugu News

హీరో సిద్దు జొన్నలగడ్డకు సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్

నటభూషణ శోభన్ బాబు బౌతికంగా లేకపోయినా తాను నటించిన సినిమాల ద్వారా ఆయన ప్రేక్షకాభిమానులలో చెరగని ముద్రను వేసుకున్నారు. అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి పేరిట ఆయన అభిమానులు రెగ్యులర్ గా వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతూ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో కలసి 'సోగ్గాడు' సినిమా స్వర్ణోత్సవాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం శోభన్ బాబు జయంతిని పురస్కరించుకుని, ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించిన యూత్ హీరో ఒకరికి ఈ ఏడాది నుంచి సోగ్గాడు శోభన్ బాబు పేరిట అవార్డ్ ను ప్రదానం చేయనున్నట్లు అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి గౌరవ చైర్మన్ రాశీ మూవీస్ నరసింహారావు, అడ్వైజర్ జేష్ఠ రమేష్ బాబు,…

Read more
తెలుగులో యాక్షన్ థ్రిల్లర్ ‘ది టాస్క్’ Telugu News

తెలుగులో యాక్షన్ థ్రిల్లర్ ‘ది టాస్క్’

డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ ఇతివృత్తంతో కన్నడంలో రూపొందిన 'ది టాస్క్' చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే పేరుతో ఈ చిత్రం తెలుగులో రానుంది. జయసూర్య ఆర్.ఆజాద్, సాగర్ రామ్, శ్రీలక్ష్మి, రఘు శివమొగ్గ ప్రధాన పాత్రధారులు. రఘు శివమొగ్గ దర్శకత్వం వహించారు, కన్నడంలో ఇటీవలనే విడుదలై...అక్కడ విశేష ప్రేక్షకాదరణను చూరగొన్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు ముత్యాల సుబ్బయ్య తనయుడు ముత్యాల అనంత కిశోర్ తెలుగులో విడుదల చేయనున్నారు. గతంలో 'తల్లి మనసు' వంటి చక్కటి ఫ్యామిలీ కథా చిత్రం ద్వారా అభిరుచి గల నిర్మాతగా ముత్యాల అనంత కిశోర్ పేరు తెచ్చుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో అంతా కొత్త వారు నటించారని, తెలుగు…

Read more
పలువురు తెలుగు సినీ దిగ్గజాల సమక్షంలో ఘనంగా “సోగ్గాడు” స్వర్ణోత్సవ కార్యక్రమం Telugu News

పలువురు తెలుగు సినీ దిగ్గజాల సమక్షంలో ఘనంగా “సోగ్గాడు” స్వర్ణోత్సవ కార్యక్రమం

నటభూషణ్ శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన "సోగ్గాడు" చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో "సోగ్గాడు" సినిమా స్వర్ణోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్ లో ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్స్, రచయితలు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - రచయితగా నన్ను నేను నమ్ముకుని 1975లో చిత్ర పరిశ్రమకు వచ్చాను. ఆ ఏడాది "సోగ్గాడు" సినిమా రిలీజైంది. ఆ సినిమా తర్వాత శోభన్ బాబు గారు హీరోగా ఒక్కో మెట్టు పైకి అధిరోహిస్తూ వెళ్లారు. శోభన్ బాబు గారికి మహిళా…

Read more