Skip to content

‘భరతవర్ష’ నుంచి ‘అమ్మ కదిలి వచ్చె’ సాంగ్ రిలీజ్

మాచో స్టార్ టి. గోపీచంద్ ప్రతిష్టాత్మక చారిత్రక యాక్షన్ చిత్రం ‘భరతవర్ష’. సంకల్ప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే అద్భుతమైన విజువల్స్‌తో రూపొందించిన గ్లింప్స్, క్రీ.శ. 642 నాటి నేపథ్యంలో వచ్చిన టైటిల్ టీజర్, పవర్‌ఫుల్ తొలి పాట ‘వీర జయధీర’ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో నవరాత్రుల సందర్భంగా ‘భరతవర్ష’ నుంచి రెండో పాటను ఈరోజు విడుదల చేశారు. ‘అమ్మ కదిలి వచ్చె’ పేరుతో విడుదలైన ఈ పాటకు అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. దుర్గాదేవి ఆరాధనలోని వైభవాన్ని, నవరాత్రి ఉత్సవాల చుట్టూ ఉండే ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ఈ పాట అద్భుతంగా ఆవిష్కరించింది. పాట పేరుకు…

Read more
‘భరతవర్ష’ నుంచి పవర్ ఫుల్ ఎపిక్ జర్నీ ఫస్ట్ సింగిల్ ‘వీర జయధీర’ రిలీజ్ Telugu News

‘భరతవర్ష’ నుంచి పవర్ ఫుల్ ఎపిక్ జర్నీ ఫస్ట్ సింగిల్ ‘వీర జయధీర’ రిలీజ్

టి. గోపీచంద్ ప్రతిష్టాత్మక చారిత్రక యాక్షన్ చిత్రం 'భరతవర్ష' ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో అంచనాలను పెంచుతూనే ఉంది. సంకల్ప్ దర్శకత్వంలో, శ్రీనివాస చిట్టూరి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి పవన్ కుమార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. క్రీ.శ. 642 నేపథ్యంలో సాగే ఈ చిత్రం, విజువల్ గా అద్భుతమైన గ్లింప్స్, టైటిల్ టీజర్‌తో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు, చిత్ర నిర్మాతలు ఫస్ట్ సింగిల్ 'వీర జయధీర' విడుదల చేశారు. ‘వీర జయధీర’ కథానాయకుడి ప్రయాణాన్ని, అతని పరివర్తనను ఆవిష్కరించే పవర్ ఫుల్ పాట గా నిలిచింది. ఒక సాధారణ వ్యక్తి నుంచి పరాక్రమవంతమైన యోధుడిగా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న కష్టాలు, పట్టుదల, లక్ష్యసాధన కోసం…

Read more
గోపీచంద్ సినిమాకు ‘భరతవర్ష’  ఫిక్స్‌ Telugu News

గోపీచంద్ సినిమాకు ‘భరతవర్ష’ ఫిక్స్‌

హీరో టి. గోపీచంద్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చారిత్రక యాక్షన్ డ్రామా #గోపీచంద్33తో తన కెరీర్‌లో ఒక కొత్త శకంలోకి అడుగుపెడుతున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో, పవన్ కుమార్ సమర్పణలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్, గోపీచంద్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. చిత్ర నిర్మాతలు పవర్ ఫుల్ గ్లింప్స్ ద్వారా సినిమా టైటిల్‌ను ఆవిష్కరించారు. క్రీ.శ. 642 నేపథ్యంలో సాగే ఈ గ్లింప్స్, శూల భూమిలో ప్రారంభమై, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో కట్టిపడేసింది. భారీ యుద్ధ సన్నివేశాలు, యుద్ధంలో ఆరితేరిన యోధుల క్లోజప్‌లు, కత్తులు, గొడ్డళ్లు, అగ్నిజ్వాలల మధ్య జరిగే పోరాటాలు కనువిందు చేసే విజువల్ ఫీస్ట్ ని అందించాయి…

Read more