“మయూఖ” అక్టోబర్ 9న రిలీజ్
పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా "మయూఖ". ఈ చిత్రాన్ని ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శశిధర్ నల్ల నిర్మిస్తున్నారు. శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "మయూఖ" సినిమా అక్టోబర్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ షణ్ముఖ చరణ్ మాట్లాడుతూ - "మయూఖ" చిత్రంలో వీరు పాత్రలో నటించాను. ఈ క్యారెక్టర్ మీ అందరికీ నచ్చుతుంది. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. అన్నారు. బేబి మది నస్రీన్…
