Skip to content

“మయూఖ” అక్టోబర్ 9న రిలీజ్

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “మయూఖ”. ఈ చిత్రాన్ని ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై శశిధర్ నల్ల నిర్మిస్తున్నారు. శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “మయూఖ” సినిమా అక్టోబర్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

మాస్టర్ షణ్ముఖ చరణ్ మాట్లాడుతూ – “మయూఖ” చిత్రంలో వీరు పాత్రలో నటించాను. ఈ క్యారెక్టర్ మీ అందరికీ నచ్చుతుంది. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. అన్నారు.

బేబి మది నస్రీన్ మాట్లాడుతూ – “మయూఖ” చిత్రంలో నేను మయూఖ చిన్నప్పటి రోల్ చేశాను. ట్రైలర్ మీకు నచ్చిందని భావిస్తున్నాం. ఈ సినిమాను తప్పకుండా థియేటర్స్ లోనే చూడాలి. అలాంటి మంచి కంటెంట్ తో ఈ మూవీ వస్తోంది. అక్టోబర్ 9న మా చిత్రాన్ని థియేటర్స్ లో చూడాలని కోరుతున్నాం. అన్నారు.

నటుడు నానానీ కర్రి మాట్లాడుతూ – ఈ చిత్రంలో సెక్యూరిటీ రవి క్యారెక్టర్ లో నటించాను. “మయూఖ” నా కెరీర్ లో వచ్చిన మంచి అవకాశంగా భావిస్తున్నా. మయూఖగా పాయల్ పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.

నటుడు దేవ్ డి మాట్లాడుతూ – “మయూఖ” ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ ను ఆకట్టుకునేలా కట్ చేశారు. ఈ సినిమాలో ఎస్ ఐ దేవ్ గా మీ అందరి ముందుకు రాబోతున్నా. మా అందరి దగ్గర నుంచి డైరెక్టర్ గారు మంచి పర్ ఫార్మెన్స్ తీసుకున్నారు. ఇలాంటి అవకాశం కోసం నాలుగేళ్లుగా వేచి చూస్తున్నా. మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

నటుడు రఘు వాసిరెడ్డి మాట్లాడుతూ – ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. ఈ సినిమాలో అందరూ హీరోలే అందరూ విలన్సే అనుకోవచ్చు. నాకు ఈ చిత్రంలో ఒక మంచి రోల్ చేసే అవకాశం రావడం హ్యపీగా ఉంది. అన్నారు.

నటుడు అభిలాష్ అడ్డ మాట్లాడుతూ – మా “మయూఖ” సినిమాకు అన్నీ తానై మా డైరెక్టర్ గారు తెరకెక్కించారు. ప్రతి క్రాఫ్ట్ బాగుండేలా చూసుకున్నారు. ఈ సినిమా మా అందరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తుందని నమ్ముతున్నాం. మా మూవీకి హీరో అయిన పాయల్ పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.

ప్రొడ్యూసర్ శశిధర్ నల్ల మాట్లాడుతూ – మా సినిమా ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. “మయూఖ” సినిమా అద్భుతంగా వచ్చింది. ట్రైలర్ లాగే సినిమా కూడా మీ అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. ఈ సినిమా తర్వాత మా హీరోయిన్ పాయల్ ను అందరూ మయూఖ అని పిలుస్తారు. అంత బాగా పర్ ఫార్మ్ చేసింది. ఈ సినిమా కోసం పాయల్ చాలా హార్డ్ వర్క్ చేసింది. మా సినిమాకు ఎ టు జడ్ అన్నీ తానై చూసుకున్నాడు మా డైరెక్టర్ శ్రీ తేజ్. ఎంతో కష్టపడి మా సినిమాను ఈ స్టేజ్ కు తీసుకొచ్చిన డైరెక్టర్ ను అప్రిషియేట్ చేస్తున్నాను. మా సినిమాకు పనిచేసిన వాళ్లంతా ఇది తమ సినిమా అనుకుని కష్టపడ్డారు. కంటెంట్ బాగుంటే మన తెలుగు ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు. అలాంటి కంటెంట్ మా సినిమాలో ఉంది. అదే నమ్మకంతో మా చిత్రాన్ని అక్టోబర్ 9న దసరా సెలవుల్లో వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మీరంతా ఆదరిస్తారని నమ్ముతున్నాం.అన్నారు.

హీరోయిన్ పాయల్ చెంగప్ప మాట్లాడుతూ – “మయూఖ” ఫీమేల్ ఒరియెంటెడ్ థ్రిల్లర్ మూవీ. ఇప్పుడు సినిమాల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఫీమేల్ ఒరియెంటెడ్ మూవీ చేయాలంటే ధైర్యం ఉండాలి. అలాంటి గట్స్ తో మా ప్రొడ్యూసర్ శశిధర్ గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కథ వింటున్నంత సేపూ థ్రిల్ ఫీల్ కలిగింది. కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది గూస్ బంప్స్ తెప్పించింది. ఈ సినిమా మీకు కొత్త ఫీల్ కలిగిస్తుంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాం. అక్టోబర్ 9న థియేటర్స్ లో చూడండి. అన్నారు.

డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్ . కె. మాట్లాడుతూ – మా పేరెంట్స్ నాపై పెట్టుకున్న నమ్మకం వల్లే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. యూఎస్ నుంచి అన్నీ వదిలేసి సినిమాల్లోకి వస్తామంటూ ఏ పేరెంట్స్ ఒప్పుకోరు. కానీ వీడు క్రియేటివ్ గా ఏదో సాధిస్తాడని నమ్మారు. ఇక మయూఖ మూవీకి వస్తే నేను సబ్జెక్ట్ చెప్పినప్పుడు నన్ను, నా స్క్రిప్ట్ ను నమ్మి పాయల్ మూవీ ఒప్పుకున్నారు. మా ప్రొడ్యూసర్ శశిధర్ గారు నాకు దర్శకుడిగా తొలి అవకాశం కల్పించారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. మా సినిమాకు వర్క్ చేసిన వాళ్లంతా ఒక ప్యాషన్ తో పనిచేశారు. నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. తెలుగు చిత్రాల్లో “మయూఖ” లాంటిది అరుదుగా వస్తుందని చెప్పగలను. హాలీవుడ్, కొరియన్ మూవీలా కలర్ గ్రేడింగ్ చేశాం. మీకు ట్రైలర్ లో ఆ క్వాలిటీ కనిపిస్తుంటుంది. మీరు మా సినిమా కోసం థియేటర్ కు వెళ్తే సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్సిపీరియన్స్ ఇస్తామని హామీ ఇస్తున్నా. ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ ఎక్సిపీరియన్స్ ఇవ్వాలనే ఈ సినిమా రూపొందించాను. అక్టోబర్ 9న థియేటర్స్ కు వచ్చి మా సినిమాను ఎంజాయ్ చేయాలని కోరుతున్నా. అన్నారు.

నటీనటులు – పాయల్ చెంగప్ప, బిగ్ బాస్ ఫేమ్ అమన్ మసూద్, దేవ్ డి, మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిశ్మ దబ్బార, జాను వర్మ, నానాజీ కర్రి, రఘు వాసిరెడ్డి, అభిలాష్ అడ్డ, వి.ఎస్. రాజు, మది నస్రీన్, బేబి మాన్వీ, మాస్టర్ షణ్ముఖ చరణ్, శశి కదిరి, రాంబాబు రామిశెట్టి, పవన్ లక్కిరెడ్డి, మణిసాయి, సత్య విఠల్, ప్రశ్విత చౌదరి నల్లా, వేగి నాయుడు, శ్రీధర్, మణికంఠ

టెక్నీషియన్స్
———————
ఆర్ట్ – బ్రహ్మనాథ్ ఎ పాటిల్
కాస్ట్యూమ్స్ – లావణ్య రాణి కాండ్రేగుల
ఎడిటర్ – శరత్. జె
డీవోపీ – ఫర్హాన్ వడక్కం
మ్యూజిక్ – శిబి మాత్యూ అలెక్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – డి.గిరీష్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్ – తేజ తోట
కో ప్రొడ్యూసర్ – మనోజ్ పోల
ప్రొడ్యూసర్ – శశిధర్ నల్ల
డైరెక్టర్ – శ్రీ తేజ్ ఎస్ కే
డిజిటల్ పీ ఆర్ ఓ : సూరపనేని మురళి కృష్ణ
పీఆర్ఓ – గాండ్ల శ్రీనివాస్ ( జి. ఎస్. మీడియా )

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.