‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘కేకు వాకు’ రిలీజ్
వైవిధ్యమైన పాత్రల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు పొందిన స్టార్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్, ఇండస్ట్రీ హిట్ బాహుబలి మూవీని నిర్మించిన మేకర్స్‌తో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై తన తొలిసారి డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రేమలు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఎస్.ఎస్. కార్తికేయ..ఇప్పుడీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను ఇండియన్ సినిమాకు గర్వకారణంగా నిలిచిన బాహుబలి ఫ్రాంచైజీ నిర్మాతలైన ఆర్కా మీడియాతో కలిసి రూపొందిస్తున్నారు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి కొత్త దర్శకుడు శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో వెర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు…
