Skip to content
సినిమా నడిస్తేనే మనందరం నడుస్తాం: తెలుగు సినీ నిర్మాతలు Telugu News

సినిమా నడిస్తేనే మనందరం నడుస్తాం: తెలుగు సినీ నిర్మాతలు

ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయని తెలుగు సినీ నిర్మాతలు అన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బుధవారం సాయంత్రం తెలుగు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిటర్లు ఏక పక్షంగా ప్రెస్ మీట్ నిర్వహించి బెదిరించినట్టుగా మాట్లాడటం సరికాదని, అందరం కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని నిర్మాతలు అన్నారు. ఎగ్జిబిటర్ల సమస్యను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అదే సమయంలో తమ…

Read more
నితిన్ – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో కొత్త సినిమా ప్రారంభం Telugu News

నితిన్ – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో కొత్త సినిమా ప్రారంభం

ప్రముఖ కథానాయకుడు నితిన్ తదుపరి ఆసక్తికరమైన చిత్రం సాంప్రదాయ పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమైంది. నాణ్యమైన, విజయవంతమైన చిత్రాలను అందించడంలో పేరుగాంచిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి, ప్రతిభావంతులైన దర్శకులు నారి సిరిసవాడ మరియు సోమశేఖర్ టి దర్శకత్వం వహిస్తున్నారు. బలమైన సృజనాత్మక బృందం ఏకమవ్వడంతో, ప్రకటనతోనే ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో నితిన్ కథానాయకుడిగా నటిస్తుండగా, రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా అనిత్ మదాడి, కళా దర్శకుడిగా జానీ షేక్ వ్యవహరిస్తున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక బృందం తమ నైపుణ్యంతో దృశ్యపరంగా ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్,…

Read more
ఘనంగా ‘ఎపిక్‌’ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ Telugu News

ఘనంగా ‘ఎపిక్‌’ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌

'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఈ చిత్రం ఒక హృద్యమైన అనుభూతిని అందిస్తుందని వాగ్దానం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట 'సంచారమే' అద్భుతమైన స్పందనను సొంతం చేసుకోగా, తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. 'ఎపిక్' టీజర్ అందమైన అనుభూతిని అందిస్తూ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల మధ్య కథను కేంద్రీకరిస్తుంది. ‘బేబీ’ సినిమా తర్వాత ఈ జంటకు ఇప్పటికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ హిట్ పెయిర్ సరికొత్తగా మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. 90’s వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న…

Read more
‘లెనిన్‌’  లో ప్రేక్ష‌కులు సరికొత్త అఖిల్‌ను చూస్తారు – నాగార్జున Telugu News

‘లెనిన్‌’ లో ప్రేక్ష‌కులు సరికొత్త అఖిల్‌ను చూస్తారు – నాగార్జున

యంగ్ అండ్ డైనమిక్ యాక్ట‌ర్‌ అఖిల్ అక్కినేని నెక్ట్స్ మూవీ ‘లెనిన్‌’ సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ‘వారెవా వారెవా..’ , ‘ఎట్టా ఎట్టా..’ అనే రెండు సాంగ్స్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు చార్ట్‌బస్టర్ సాంగ్స్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. మ్యూజిక‌ల్ సెన్సేష‌న‌ల్ త‌మ‌న్ సంగీత సారథ్యంలో విడుద‌లైన ఈ పాట‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించి సినిమాపై పాజిటివ్ బ‌జ్‌ను క్రియేట్ చేశాయి. ఇటీవల కింగ్ నాగార్జున.. లెనిన్ మూవీ ఫస్ట్ కాపీని చూసి సినిమా అవుట్‌పుట్‌తో పాటు టీమ్ పనితీరుపై చాలా ఇంప్రెస్ అయ్యారు. అంతే కాకుండా, నిన్న సినిమా చూశాన‌ని, ఎంతో నచ్చిందని బుధ‌వారం రోజున త‌న ఎక్స్ అకౌంట్‌ (ట్విట్టర్)లో ట్వీట్ ద్వారా తెలియజేశారు…

Read more
‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌ Telugu News

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

- జూన్ 26న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున సినిమా విడుద‌ల‌ యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటీవ‌ల విడుద‌లైన తొలి సాంగ్ ‘వారేవా వారేవా..’కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. త‌మ‌న్ సంగీత సారథ్యంలో విడుదలైన ఈ సాంగ్‌తో మూవీ ప్ర‌మోష‌న్స్ షురూ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎట్టా ఎట్టా..’ అనే సాంగ్ రెండో పాట‌గా విడుద‌లైంది. చ‌క్క‌టి మ్యూజిక్ ట్రాక్‌తో ఈ పాట‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ జోష్‌తో నిండిన డాన్స్ మెలోడీ క్యాచీ బీట్స్, ఎనర్జీతో మెప్పిస్తోంది. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య ఉండే…

Read more
శ్రీవిష్ణు కథానాయకుడిగా కొత్త చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ Telugu News

శ్రీవిష్ణు కథానాయకుడిగా కొత్త చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

వైవిద్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవిష్ణు కథానాయకుడిగా ప్రొడక్షన్ నెం.39 ని ఈరోజు అధికారికంగా ప్రకటించింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సన్నీ సంజయ్ రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. "ప్రతి యువకుడి కథ"(The Story of Every Youngster) అనే అద్భుతమైన ట్యాగ్‌లైన్‌తో ఆవిష్కరించబడిన ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సినిమా యొక్క ఆలోచనాత్మక మరియు భావోద్వేగాలతో కూడిన ప్రపంచంలోకి ఈ పోస్టర్ ప్రేక్షకులను తీసుకొని వెళుతుంది. తనదైన వినోదాత్మక నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా, అన్ని రకాల భావోద్వేగాలను గొప్పగా పలికించగల సామర్థ్యమున్న నటుడిగా పేరుగాంచిన శ్రీ విష్ణు, ఈ సినిమాలో మరో చిరస్మరణీయ…

Read more
రవితేజ ‘మాస్ జతర’ ట్రైలర్ విడుదల Telugu News

రవితేజ ‘మాస్ జతర’ ట్రైలర్ విడుదల

మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మాస్ జతర' సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. రవితేజ నుండి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే అసలుసిసలైన మాస్ వేడుకలా ఈ ట్రైలర్ ఉంది. రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ తనదైన శైలిలో ఒదిగిపోయిన తీరు కట్టిపడేసింది. రవితేజ అంటేనే ఉత్సాహంతో తెర వెలిగిపోతుంది. ఆ ఉత్సాహం 'మాస్ జతర' ట్రైలర్ లో అడుగడుగునా కనిపించింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే పంచ్ డైలాగ్‌లతో మాస్ మహారాజా అభిమానులు కోరుకునే మాస్ విందులా ఈ ట్రైలర్ ను మలిచారు. కథానాయకుడు, ప్రతినాయకుడు మధ్య ఉత్కంఠభరితమైన సంఘర్షణ నేపథ్యంలో ట్రైలర్ ను రూపొందిన తీరు ఆకట్టుకుంది. వాణిజ్య అంశాలతో నిండిన పూర్తి స్థాయి…

Read more
‘మాస్ జాతర’ చిత్రం నుండి మాస్ గీతం ‘సూపర్ డూపర్‌’ విడుదల Telugu News

‘మాస్ జాతర’ చిత్రం నుండి మాస్ గీతం ‘సూపర్ డూపర్‌’ విడుదల

'మాస్ జాతర' చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన 'తు మేరా లవర్', 'ఓలే ఓలే', 'హుడియో హుడియో' గీతాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకొని, సామాజిక మాధ్యమాల్లో ఉర్రూతలూగించాయి. తాజాగా చిత్ర బృందం, నాలుగో గీతంగా ఉత్సాహభరితమైన మాస్ పాట 'సూపర్ డూపర్‌'ను విడుదల చేసింది. రవితేజ మాస్ కి, శ్రీలీల ఎనర్జీకి తగ్గట్టుగా స్వరపరిచిన ఈ బ్లాక్ బస్టర్ ట్యూన్ అందరినీ కట్టిపడేస్తోంది. 'మాస్ జాతర' చిత్రాన్ని, ఆల్బమ్ ని మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేలా ఈ 'సూపర్ డూపర్‌' గీతముంది. రెండు ఉత్సాహభరితమైన పాటలు, ఓ మంచి మెలోడీతో ఇప్పటికే 'మాస్ జాతర' ఆల్బమ్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా విడుదలైన మాస్ ని ఉర్రూతలూగించే ఈ 'సూపర్ డూపర్‌'…

Read more
ఫంకీ’ టీజర్ విడుదల Telugu News

ఫంకీ’ టీజర్ విడుదల

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందుతోన్న చిత్రం 'ఫంకీ'. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. అనుదీప్ దర్శకత్వంలో వినోదం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపేలా 'ఫంకీ' టీజర్ ఎంతో హాస్యభరితంగా, ఓ విందు భోజనంలా ఉంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ దర్శకుడి పాత్రను పోషిస్తుండటం విశేషం. ఇందులో విశ్వక్ సరికొత్తగా కనిపిస్తున్నారు. కథానాయిక కయాదు లోహర్‌ తన అందంతో కట్టిపడేశారు. వీరి జోడి కొత్తగా, ఉత్సాహంగా కనిపిస్తూ.. తెరకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. టీజర్ లో భీమ్స్ సిసిరోలియో సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తనదైన నేపథ్య…

Read more
మాస్ జాతర’ చిత్రం నుండి ‘హుడియో హుడియో’ విడుదల Telugu News

మాస్ జాతర’ చిత్రం నుండి ‘హుడియో హుడియో’ విడుదల

'మాస్ జాతర' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'తు మేరా లవర్', 'ఓలే ఓలే' గీతాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకొని, సామాజిక మాధ్యమాల్లో ఉర్రూతలూగించాయి. తాజాగా చిత్ర బృందం, మూడవ గీతంగా 'హుడియో హుడియో' అనే సరికొత్త మెలోడీని ప్రేక్షకులకు అందించింది. మాస్ మరియు మెలోడీని అందంగా మిళితం చేసిన ఈ మనోహరమైన ట్యూన్, అందరినీ కట్టిపడేస్తోంది. ఈ గీతం సినిమా మరియు ఆల్బమ్ రెండింటికీ సరైన భావోద్వేగ లయను తాకుతుంది. రెండు ఉత్సాహభరితమైన పాటలతో అందరినీ కాలు కదిపేలా చేసిన తర్వాత, ఇప్పుడు శ్రోతల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకునే ఓ మంచి మెలోడీతో వచ్చారు. మునుపటి మాస్ మహారాజా రవితేజను తిరిగి తీసుకొని వస్తున్నట్టుగా మాస్-క్లాస్ కలిసిన ఆరా ఇందులో…

Read more