ఘనంగా జరిగిన ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్
విద్యార్థులపై విద్యా ఒత్తిడి.. మానసిక సమస్యలు, ఆత్మహత్యల నివారణే చిత్ర ప్రధానాంశం హైదరాబాద్: శ్రీ వాత్సల్య ఆడియో అండ్ వీడియో ఇల్లస్ట్రేషన్స్ పతాకంపై రూపొందిన తొలి చిత్రం ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం చాంబర్ ప్రీవ్యూ హాల్‌లో ఘనంగా జరిగింది. చిత్ర రచయిత, దర్శకుడు, నిర్మాత స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొన్నారు. స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర మాట్లాడుతూ.. గత 26 సంవత్సరాలుగా తిరువన్నామలైలో వైదిక ధర్మశాస్త్రాలను అధ్యయనం చేసిన తాను, నేటి యువతలో నైతిక విలువలు, మానవతా దృక్పథాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినట్లు తెలిపారు. ‘జై…
