సింగరేణి కార్మికుల నిజ జీవిత కథతో హీరో సాగర్ పాన్ ఇండియా చిత్రం.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
‘ది 100’ సినిమాతో రీసెంట్గా హిట్ కొట్టిన హీరో సాగర్ మరో వినూత్న ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నారు. సింగరేణి కార్మికుల జీవితాల్ని తెరపైకి తీసుకు వచ్చేందుకు సాగర్ ముందడుగు వేశారు. పాన్ ఇండియా వైడ్‌గా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో చాలా తక్కువ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. సింగరేణి కార్మికుల దుర్భలమైన జీవితాలు, వారి కష్టాల్ని తెరపై ఆవిష్కరించేందుకు ‘జార్జి రెడ్డి’ దర్శకుడు జీవన్ రెడ్డి ముందుకు వచ్చారు. ‘జార్జి రెడ్డి’ చిత్రంతో మేకర్‌గా జీవన్ రెడ్డికి మంచి ఇమేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి తెలంగాణ నేపథ్యంలోని సింగరేణి బ్యాక్ డ్రాప్‌పై సినిమాను తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు. సింగరేణి బొగ్గు గనుల…
