‘ది ప్యారడైజ్’ గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది: సంపూర్ణేష్ బాబు
న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంపూర్ణేష్ బాబు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. బిర్యాని క్యారెక్టర్ తో అందరినీ సర్ ప్రైజ్ చేశారు కదా? -డైరెక్టర్ శ్రీకాంత్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. వెళ్లి కలిసాను. అందులో బిర్యాని క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటివరకు…
