‘ది ట్రెయిటర్స్’ ట్రైలర్ లాంచ్
భారతదేశంలో ప్రత్యేక ఒరిజినల్స్‌కు పేరుపొందిన ప్రముఖ స్ట్రీమింగ్ సర్విస్ ప్రైమ్ వీడియో, ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేసింది. నమ్మకం, మోసం, ద్రోహం చుట్టూ సాగే ఈ ఉత్కంఠభరితమైన గేమ్‌కు ట్రైలర్ ఆసక్తికరమైన పరిచయాన్ని అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రియాలిటీ ఫార్మాట్‌ను తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన స్థానిక హంగులతో తీసుకొస్తున్నారు. విభిన్న రంగాలకు చెందిన 20 మంది సెలబ్రిటీలు ఈ గేమ్‌లో పాల్గొంటున్నారు. చిన్మయీ శ్రీపాద, హర్ష వర్ధన్, ప్రగతి మహావాది, శ్రీదేవి చౌదరి, నిఖిల్ విజయేంద్ర సింహ, విద్యూ రామన్, విష్ణు ఓయ్, శ్రావ్య వర్మ, డాక్టర్ మేఘనాథ్ రెడ్డి, మౌనీషా చౌదరి, స్వీకర్ అగస్తి, ఆశికా పదుకొనే, వర్షా డి'సౌజా, ప్రణవ్ అలియాస్…
