సెప్టెంబర్ 12న దద్దరిల్లిపోతుంది: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ 'కిష్కింధపురి' అలరించబోతున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. 'ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన పశ్చిమ దిక్కున ప్రేతాత్మలన్నీ పేరు వినగానే తూర్పుకు తిరిగే ప్రదేశం' అనే డైలాగులతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. హీరో, హీరోయిన్ సహా కొంతమంది స్నేహితుల ఆత్మలని అన్వేషిస్తూ సువర్ణ మాయ ఇంటిలోకి వెళ్తారు. అక్కడ వారు ఊహించని భయంకరమైన పరిస్థితులు ఎదురుకావడం మైండ్…
