హైదరాబాద్ నుంచి వారణాసి వరకు ‘నాగబంధం’ అద్భుత ప్రచార యాత్ర
అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్' చిత్రాన్ని దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిపేందుకు చిత్రబృందం విస్తృత స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్నారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం మేకర్స్ దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రమోషనల్ టూర్‌ను ప్రకటించారు. సాధారణ ప్రమోషన్స్‌కు భిన్నంగా, సినిమా కథలోని ట్రెజర్ హంట్ కాన్సెప్ట్‌కు అనుగుణంగా ఈ ప్రచార యాత్రను రూపొందించారు. ప్రతి నగరంలో జరిగే కార్యక్రమం ద్వారా సినిమా ప్రపంచం, అందులోని రహస్యాలు, సాహస అంశాలను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయనున్నారు. ఈ టూర్‌లో తొలి…
