#RAPO23 కి డీవోపీగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ తిరు
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లో మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. #RAPO23 చిత్రంతో ఆయన దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తున్నారు. రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచే సినీ వర్గాలు, అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన ‘వీర’ ఫస్ట్ గ్లింప్స్‌తో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరునావుకరసు (తిరు) ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా జాయిన్ అయ్యారు. #RAPO23 చిత్రంతో రామ్ రచయిత-దర్శకుడిగా పరిచయం అవుతున్నారు, అలాగే ఇందులో ఆయనే హీరో పాత్రలో నటిస్తున్నారు. కొత్తగా ప్రారంభించిన రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ చిత్రం "The…
