Skip to content

ప్రభాస్ ‘ఫౌజీ’ డిసెంబర్ 3న రిలీజ్

రెబెల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఫౌజీ’తో వెండితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ భారీ పీరియడ్ యాక్షన్ చిత్రం 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. హను రాఘవపుడి దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, టి-సిరీస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే అద్భుతమైన టైటిల్ పోస్టర్‌తో అంచనాలు పెంచింది.

రిలీజ్ డేట్ తో పాటు విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో ‘ఫౌజీ’ ప్రపంచాన్ని, సినిమా భారీ స్థాయిని అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రభాస్ ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని రగ్డ్, ఎమోషనల్ అవతార్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.

యుద్ధంలో తీవ్రంగా గాయపడిన ఓ యోధుడిలా, రక్తంతో తడిసిన దుస్తులు, శరీరమంతా గాయాలతో, చుట్టూ నేలకూలిన సైనికుల మధ్య తుపాకీని పట్టుకుని నిశ్శబ్దంగా కూర్చున్న ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ఆయన లుక్ ఓ యోధుడి త్యాగం, బాధ, ధైర్యం, పట్టుదలను ప్రజెంట్ చేస్తోంది.

పొడవాటి జుట్టు, గడ్డం, యుద్ధం వల్ల అలసిపోయిన శరీరం, రక్తపు మరకలతో ఉన్న తెల్లటి ధోతీలో ప్రభాస్ చేసిన మేకోవర్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది. తన హావభావాలతోనే బాధ, ధైర్యం, సంకల్పం, ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచే విధంగా పోస్టర్ రూపొందించారు.

పోస్టర్‌లో కనిపిస్తున్న యుద్ధభూమి కూడా కథలోని ఇంటెన్సిటీ తెలియజేస్తోంది. పొగతో నిండిన వాతావరణం, చుట్టూ పడిపోయిన సైనికుల మృతదేహాలు యుద్ధం ఎంత భయంకరంగా సాగిందో సూచిస్తున్నాయి. భారీ స్థాయిలో రూపొందించిన యాక్షన్‌తో పాటు, అంతే బలమైన భావోద్వేగాలు కూడా సినిమాలో ఉండబోతున్నాయని ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది.

ముఖ్యంగా ఈ పోస్టర్ సినిమాలోని అత్యంత భారీ యాక్షన్ ఎపిసోడ్‌లలో ఒకదానికి సంబంధించినది. థియేటర్లలో ఈ సీక్వెన్స్ ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ‘ఫౌజీ’ కేవలం యుద్ధ నేపథ్య చిత్రమే కాకుండా, భావోద్వేగాలతో కూడిన గొప్ప సినీ అనుభూతిని అందించే చిత్రంగా రూపొందుతున్నట్లు పోస్టర్ తెలియజేస్తోంది.

రిలీజ్ డేట్ ప్రకటనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఒక పోస్టర్‌తోనే ఇంత ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం, థియేటర్లలో అద్భుతమైన అనుభూతిని అందించబోతుంది. భారీ యాక్షన్, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, అద్భుతమైన విజువల్స్, అత్యున్నత సాంకేతిక విలువలతో ‘ఫౌజీ’ 2026లో అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. అనిల్ విలాస్ జాధవ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

ప్రభాస్ సరికొత్త అవతార్, భారీ స్థాయి నిర్మాణం, ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు వచ్చిన స్పందనతో ‘ఫౌజీ’ 2026లో అత్యంత భారీ పాన్ ఇండియా చిత్రంగా, బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే చిత్రంగా మారబోతోంది.

తారాగణం: ప్రభాస్, ఇమాన్వి, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భాను చందర్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హను రాఘవపూడి
నిర్మాత: మైత్రీ మూవీ మేకర్స్
సమర్పణ: గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ & T-సిరీస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, భూషణ్ కుమార్
DOP: సుదీప్ ఛటర్జీ ISC
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ప్రొడక్షన్ డిజైనర్: అనిల్ విలాస్ జాదవ్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సాహిత్యం: కృష్ణకాంత్
కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్
కాస్ట్యూమ్ డిజైనర్లు: శీతల్ ఇక్బాల్ శర్మ, టి విజయ్ భాస్కర్
VFX: RC కమల కన్నన్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.